అద్దె యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2022-03-06T03:48:04+05:30
కస్టమ్ హైరింగ్ సెంటర్‌లో అందుబాటులో ఉన్న సాగు యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. నెన్నెలలో సెర్ప్ ఆధ్వర్యంలో రూ.26 లక్షలతో ఏర్పాటు చేసిన అద్దె వ్యవసాయ పనిముట్ల కేంద్రం(కస్టమ్ హైరింగ్ సెంటర్)ను శనివారం డీఆర్‌డీవో శేషాద్రితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ దృష్ట్యా రైతులకు అవసరమైన యంత్రాలను అద్దెకు ఇచ్చేందుకు మహిళా సంఘాలు హైరింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
నెన్నెల, మార్చి 5: కస్టమ్ హైరింగ్ సెంటర్‌లో అందుబాటులో ఉన్న సాగు యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. నెన్నెలలో సెర్ప్ ఆధ్వర్యంలో రూ.26 లక్షలతో ఏర్పాటు చేసిన అద్దె వ్యవసాయ పనిముట్ల కేంద్రం(కస్టమ్ హైరింగ్ సెంటర్)ను శనివారం డీఆర్‌డీవో శేషాద్రితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ దృష్ట్యా రైతులకు అవసరమైన యంత్రాలను అద్దెకు ఇచ్చేందుకు మహిళా సంఘాలు హైరింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నెన్నెల మండల సమాఖ్య జిల్లాకే ఆదర్శంగా నిలస్తోందన్నారు. ఎస్‌హెచ్‌జీలు సొంతంగా బ్యాంకు ఏర్పాటు చేసుకొనే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కంబైన్డ్ హార్వ్వెస్టర్, ట్రాక్టర్, ట్రైలర్, రోటోవేటర్, కేజీవీల్స్, పవర్ స్ర్పేయర్లు అందుబాటులో ఉన్నాయని ఏపీఎం విజయలక్ష్మి తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా 21 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఎంపీపీ సంతోషం రమాదేవి, డీపీఎం స్వర్ణలత, ఆత్మ, పీఏసీఎస్, రైతు సమన్వయ సమితి చైర్మన్లు సున్నం రాజు, మేకల మల్లేష్, అశోక్‌గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T03:48:04+05:30 IST