ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు అధిక దిగుబడులు సాధించాలి

ABN, First Publish Date - 2022-10-18T03:24:59+05:30

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపు చ్చుకొని రైతులు అధిక దిగుబడులు సాధించాలని కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డా.రాజేశ్వర్‌నాయక్‌ అన్నారు. సోమవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

రైతు సదస్సులో పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి రూరల్‌, అక్టోబరు 17: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపు చ్చుకొని  రైతులు అధిక దిగుబడులు సాధించాలని కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డా.రాజేశ్వర్‌నాయక్‌ అన్నారు. సోమవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డా.రాజేశ్వర్‌ నాయక్‌ మాట్లాడుతూ వివిధ పంటలలో అధిక పోషణ విలువలు గల రకాల పైన అవగాహన పెంచుకోవాలన్నారు. నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకువస్తూ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతు న్నామని తెలిపారు.  ఉత్తర తెలంగాణ ప్రాంతీయ వ్యవసాయ సహ పరిశోధనా సంచాలకులు డా.శ్రీనివాస్‌  మాట్లాడుతూ  ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అవగాహన పెంచుకొని శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగు బడులు సాధించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు కల్పన, శ్రీనివాస రావు, ఉద్యానవన శాఖ అధికారి నదీమ్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ మహిపాల్‌రెడ్డి,  మత్స్యశాఖ అధికారి భవ్యశ్రీ, జడ్పీ వైస్‌చైర్మన్‌ సత్యనారాయణ, ఎంపీపీ శ్రీని వాస్‌, అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు  పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-18T03:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising