ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ కోతలపై రోడ్డెక్కిన అన్నదాతలు

ABN, First Publish Date - 2022-08-20T03:39:46+05:30

అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. తాళ్ళపేట, మాకులపేట, నాగసముద్రం రైతులు గంటపాటు రోడ్డుపై తాళ్ళపేట రహదారిపై బైఠాయించారు. పలువురు రైతులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం మూలంగా విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారి గృహావ సరాలతోపాటు వ్యవసాయ రంగానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప కనీసం 3గంటలు కూడా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని రైతులు మండిపడ్డారు

రాస్తారోకో వద్ద రైతులతో మాట్లాడుతున్న ఎస్సై సతీష్‌.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండేపల్లి, ఆగస్టు 19: అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. తాళ్ళపేట, మాకులపేట, నాగసముద్రం రైతులు గంటపాటు రోడ్డుపై తాళ్ళపేట రహదారిపై బైఠాయించారు. పలువురు రైతులు మాట్లాడుతూ  అధికారుల నిర్లక్ష్యం మూలంగా విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారి గృహావ సరాలతోపాటు వ్యవసాయ రంగానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప కనీసం 3గంటలు కూడా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని రైతులు మండిపడ్డారు. వ్యవసాయ మోటార్ల కాలి పోతూ ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు రావాలంటూ రైతులు నినాదాలు చేశారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో, విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి ఎస్సై సతీష్‌ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతుల సమస్యపై సంబంధిత శాఖ అధికారితో ఫోన్‌ మాట్లాడారు.  కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తామని అధికారులు రైతులకు హామీ ఇవ్వడంతో  రాస్తారోకో విరమించారు.   

Updated Date - 2022-08-20T03:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising