ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2022-09-28T05:35:36+05:30

పొలానికి మందు పిచికారీ చేస్తున్న వ్యవసాయ కూలీని విద్యుదాఘాతం నుంచి కాపాడేందుకు వెళ్లిన ఓ రైతు మృతిచెందాడు.

పుల్లయ్య(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతగిరి, సెప్టెంబరు 27: పొలానికి మందు పిచికారీ చేస్తున్న వ్యవసాయ కూలీని విద్యుదాఘాతం నుంచి కాపాడేందుకు వెళ్లిన ఓ రైతు మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో మంగళవారం ఈ సంఘ టన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ బుర్ర పుల్లయ్య(65) మం గళవారం ఉదయం తన పొలానికి అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బొళ్లమల్ల శేషగిరితో కలిసి మందు పిచికారీ చేస్తున్నారు. అయితే సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలం పైనుంచి వెళ్తున్న విద్యుత్‌ వైర్‌ తెగి పొ లంలో పడింది. ఆ వైర్‌ను గమనించకుండా శేషగిరి మందు పిచికారీ చేయగా ఎర్త్‌ పాసై శేషగిరి పడిపోయాడు. పక్కనే ఉన్న బుర్ర పుల్లయ్య హడావిడిగా పరుగెత్తుతూ శేషగిరి వద్దకు వెళ్తుండగా పుల్లయ్య కాలుకు విద్యుత్‌ వైర్‌ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనలో శేషగిరి ప్రాణాలతో బయటపడ్డాడు. పుల్లయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పుల్లయ్య పెద్దకుమారుడు సైదులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ ఇస్మాయిల్‌ తెలిపారు.


పిడుగుపాటుకు మహిళా కూలీ 

నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండలకేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీ కాట్రేగుల గంగమ్మ(55) పి డుగుపాటుతో మృతిచెందింది. మంగళవారం పత్తి చేనులో కలుపు తీస్తున్న గంగమ్మ తలపై పిడుగు పడడంతో ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, టవల్‌, జుట్టు కాలిపోయి విగిత జీవి గా పడిపోయింది. ఆమెతో పాటు పత్తి చేనులో పని చేస్తున్న ఏడుగురు కూలీలలో నలుగురు స్పృహ కోల్పోగా కొద్దిసేపటి తర్వాత కోలుకు న్నారు. అనుకోని సంఘటనతో సహచర కూలీలు భయాందోళనకు గురయ్యా రు. గంగమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె కాగా, అందరికీ వివా హాలయ్యా యి. గంగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వా సుపత్రికి తరలించారు. కులీలను అంబులెన్స్‌లో సూర్యాపేటకు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి  నిలకడగానే ఉంది. అందరితో కలివిడిగా ఉండే గంగమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్‌ఐ ముత్తయ్య, ఆర్‌ఐ లక్ష్మీనరసింహ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

Updated Date - 2022-09-28T05:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising