ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదో తరగతి పరీక్ష కేంద్రాల పరిశీలన

ABN, First Publish Date - 2022-05-23T06:22:15+05:30

కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌,మే22: కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి జరిగే పది పరీక్షల కోసం ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కేంద్రాలను సిద్ధం చేయగా డీఈవో టి.ప్రణీత ఆధ్వర్యంలో ఆదివారం పలు పాఠశాలలకు వెళ్లి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 64 కేంద్రాల్లో 11,256 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే పట్టణంలో ఏర్పాటు చేసిన పలు కేంద్రాలతో పాటు ఆయా మండల కేంద్రాల్లోని పరీక్ష కేంద్రాలను డీఈవో ప్రణీత పరిశీలించి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాల్‌టికెట్ల వారీగా విద్యార్థులకు మధ్య దూరం ఉండేలా చూడాలని సూచించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి 12.45 వరకు జరుగనున్నందున విద్యార్థులు 8.30 నుంచే కేంద్రాలకు చేరుకోవాలని   9.45కు గేట్లు మూసి వేయాలని సూచించారు. కాగా వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.


Updated Date - 2022-05-23T06:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising