ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-08-19T07:13:47+05:30

దేశంలోని ప్రతీవ్యక్తి భవిష్యత్తులో క్రీడా స్ఫూర్తి ప్రదర్వించాలని, క్రీడల్లో మరింతగా రాణించాలని కలెక్టర్‌ ముషా రఫ్‌ ఫారూఖీ యువతకు పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 18 : దేశంలోని ప్రతీవ్యక్తి భవిష్యత్తులో క్రీడా స్ఫూర్తి ప్రదర్వించాలని, క్రీడల్లో మరింతగా రాణించాలని కలెక్టర్‌ ముషా రఫ్‌ ఫారూఖీ యువతకు పిలుపునిచ్చారు. గురువారం స్వాతంత్య్ర వజ్రోత్స వాల్లో భాగంగా డిగ్రీ కళాశాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్‌కప్‌లో కలెక్టర్‌ పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని జీవితంలో ఎన్నో మార్పులు చేసుకోవచ్చునని అన్నారు. ఏదైనా సాధించవచ్చునని పేర్కొన్నారు. సమ యం దొరికినప్పుడల్లా వాకింగ్‌, రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలని, ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. విద్యార్థులు గెలుపు ఓటమి గూర్చి ఆలోచించకుండా క్రీడాస్ఫూర్తితో ఆడాలని అన్నారు. అధికారులు క్రీడల నిర్వహణకు చేసిన కృషిని కలెక్టర్‌ ప్రశంసించారు. ఏ జిల్లాలో లేని విధంగా జిల్లాలో యువత, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు వజ్రోత్సవ వేడుకల్లో అధికసంఖ్యలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ... గత వారం రోజులుగా జిల్లా పరిధిలోని గ్రామ, మండల స్థాయిలో ఫ్రీడమ్‌ కప్‌ నిర్వహించి చివరగా నిర్మల్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్‌ రమేష్‌, సీసీఎస్‌ ఇన్స్‌పెక్టర్‌ కుమారస్వామి, డీసీఆర్‌బీ ఇన్స్‌పెక్టర్‌ తదితరులున్నారు. 

Updated Date - 2022-08-19T07:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising