ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదుల విభాగానికి సమస్యల వెల్లువ

ABN, First Publish Date - 2022-10-18T05:29:57+05:30

కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఫిర్యాదుల విభాగానికి సమస్యలపై అర్జీలు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రజావాణిలో భా గంగా ప్రజల నుంచి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కరించాల్సిన ఇబ్బందులపై అర్జీలను స్వీకరించారు. తాంసి మండలంలోని గోట్కూరి గ్రామంలో ఆంగ్ల మాధ్యమాన్ని బోధించేందుకు వెంటనే ఎస్జీటీ ఉపాధ్యా యున్ని

ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ టౌన్‌, అక్టోబరు 17: కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఫిర్యాదుల విభాగానికి సమస్యలపై అర్జీలు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రజావాణిలో భా గంగా ప్రజల నుంచి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కరించాల్సిన ఇబ్బందులపై అర్జీలను స్వీకరించారు. తాంసి మండలంలోని గోట్కూరి గ్రామంలో ఆంగ్ల మాధ్యమాన్ని బోధించేందుకు వెంటనే ఎస్జీటీ ఉపాధ్యా యున్ని నియమించాలని గోట్కూరి గ్రామస్థుడు దేవిదాస్‌ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. తమ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతిలో 91 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. కానీ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయ పోస్టు ఖాళీ 2021 మార్చి 1 నుంచి ఉందని, దీనిపై డీఈవోను కలిసినా ఎలాంటి ఫలితం లేదని పేర్కొన్నారు. అలాగే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిమ్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్టాఫ్‌ నర్సులు సిర్ర దేవేందర్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. అంత కుముందు ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్‌ మాట్లాడుతూ ఆయా శాఖలకు వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్లు రిజ్వాన్‌ భాషాషేక్‌, నటరాజ్‌, ఆర్డీవో రమేష్‌రాథోడ్‌, డీఆర్డీవో కిషన్‌, తదితరులున్నారు.

Updated Date - 2022-10-18T05:29:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising