ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విచారణలో ఉన్న కేసుల శాతం తగ్గేలా కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-05-18T06:57:10+05:30

జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో విచారణలో ఉన్న కేసులను సత్వరం పూర్తి చేయాలని, వాటిని ఛేదించి బాధితులకు న మ్మకం కలిగించాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ పోలీస్‌ అధికారులను ఆదేశిం చారు.

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం

టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలి

సమీక్షా సమావేశంలో ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌

నిర్మల్‌ కల్చరల్‌, మే 17 : జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో విచారణలో ఉన్న కేసులను సత్వరం పూర్తి చేయాలని, వాటిని ఛేదించి బాధితులకు న మ్మకం కలిగించాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ పోలీస్‌ అధికారులను ఆదేశిం చారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలీస్‌ స్టేషన్‌ల వారీగా నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కమ్యూ నిటీ పోలీసింగ్‌లో భాగంగా గత నెలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలపై వివరాలు అడిగారు. కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాల న్నారు. గ్రేవ్‌ కేసులను సర్కిళ్లవారీగా సమీక్ష జరిపారు. కోర్టు విధులు నిర్వ హించే పోలీస్‌ అధికారులు సమర్థవంతంగా పనిచేసి కన్వెక్షన్‌ రేటు పెంచా లని, సాక్షులను సరైన విధంగా ప్రవేశపెట్టాలని, పీపీ సూచనలు తీసుకోవాల న్నారు. హెచ్‌ఆర్‌ఎంఎస్‌ అప్లికేషన్‌ ద్వారా పోలీస్‌శాఖలో కాగిత రహిత సేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. ఉద్యోగికి చెందిన సర్వీస్‌ వివ రాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయవచ్చునని తెలిపారు. ఈ విధానంతో పోలీస్‌ శాఖలోని ఉద్యోగులకు పారదర్శక సేవలు అందుతాయని వివరించారు. రోజువారీ విధుల్లో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు తాము నిర్వహించాల్సిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండా లని అన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారునితో మర్యాదగా ప్రవర్తించాలని, సమస్యలు సావధానంగా విని సరైన సూచనలు చేయాలని తెలిపారు. ఆస్తి సంబంధిత నేరాలు జరుగకుండా ముందస్తు సమాచార సేకరణ చేయాలని, రాత్రి వేళల్లో గస్తీ, పెట్రోలింగ్‌ చేపట్టాలన్నారు. బాధ్యతగా విధులు నిర్వర్తిస్తే ప్రజాభిమానం, నమ్మకం పొందగలుగుతారన్నారు. ఈ సందర్భంగా యువత మేలుకో - గంజాయి మానుకో వీడియో పాట సీడీని ఎస్పీ ఆవిష్కరించారు. పాట రాసిన డీఎస్పీ జీవన్‌రెడ్డిని, గాయకుడు సుదర్శన్‌, నాగరాజును అభి నందించారు. అడిషనల్‌ ఎస్పీ రామ్‌రెడ్డి, నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, జీవన్‌ రెడ్డిలతో పాటు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T06:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising