ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ABN, First Publish Date - 2022-10-18T03:36:13+05:30

గ్రామపంచా యతీల సమగ్రాభివృద్ధికి కృషిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌నుంచి అన్ని మండలాల ఎంపీడీవో లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికా రులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వీసీలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, అక్టోబరు 17: గ్రామపంచా యతీల సమగ్రాభివృద్ధికి కృషిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌నుంచి అన్ని మండలాల ఎంపీడీవో లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికా రులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నివేది కను వెంటనే పంపించాలన్నారు. ప్రతి రోజు పోడు భూముల సర్వేకి సంబంధించిన నివే దిక పంపించాల్సి ఉన్నందున సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిరుధా న్యాలు అందించే ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో ఎక్కు వగా హెచ్‌ఎల్‌ఎల్‌కు సంబంధించిన బిల్లులురాలేదని ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని పరిష్కరించే విధంగా ఎంపీడీవోలు చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌, జిల్లా వైద్యాధి కారి ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీ అధికారి రమేష్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలి

ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో అందించిన దర ఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వ యంతో పరిష్కరించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికా రులకు సూచించారు. సోమవారం కలెక్ట రేట్‌లో దరఖా స్తుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. కెరమెరి మండలం దేవుడుపల్లి గ్రామస్థులు తమ గ్రామాన్ని కుమరం భీం ప్రాజెక్టులో ముంపు గ్రామంగా గుర్తించి నష్టపరిహారం చెల్లించారన్నారు. కానీ ఇంతవరకు పున రావాసం కల్పించలేదన్నారు. ఈవిషయంపై దృష్టి సారించి ఆదుకోవాలని కోరుతూ గ్రామస్థులు దర ఖాస్తు అందజేశారు. జైనూరు మండలం ఆశపల్లి గ్రామానికిచెందిన భీంరావు తన తండ్రిపేరిట ఉన్న పట్టాభూమిని ఇతరులు వారిపేరుపై పట్టా చేయించుకున్నారని, ఈవిషయంపై విచారణ జరిపి న్యాయంచేయాలని దరఖాస్తు చేసుకున్నా డు. దహెగాం మండలం కల్వాడ గ్రామానికి చెందిన అనంతలక్ష్మి గ్రామశివారులో తన పేరి టగల భూమివివరాలు ధరణిలో నమోదు అయ్యాయని, డిజిటల్‌ పాసుబుక్‌ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తుచేసుకుంది. ఆసి ఫాబాద్‌ మండలం జన్కాపూర్‌కు చెందిన లత నిరుపేదలమైన తాము 15ఏళ్లుగా కిరాయి ఇంటిలో ఉంటున్నామని ప్రభుత్వపరంగా ఇల్లు, ఇంటిస్థలం మంజూరు చేయాలనిదరఖాస్తు చేసుకుంది. పెంచి కలపేట మండలం బొంబాయిగూడ గ్రామానికి చెంది న శంకర్‌, ఆసిఫా బాద్‌ మండలం ఎల్లారంకు చెందిన నాగేశ్వర్‌రావు తమకు దివ్యాంగ పెన్షన్‌మంజూరు చేయాలని వేర్వేరుగా దరఖాస్తుచేసుకున్నారు. కాగజ్‌ నగర్‌లోని కేజీబీవీలో విధుల నుంచి తొలగించిన ఎస్‌ వో,సీఆర్టీ,పీఈటీ,ఏఎన్‌ఎంలను తిరిగివిధుల్లోకి తీసుకో వాలని టీఎస్‌పీఆర్టీయూ ఆధ్వర్యంలో నాయకులు శ్రీని వాస్‌,రాము,ప్రకాష్‌ కలెక్టర్‌కువినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2022-10-18T03:36:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising