ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలి

ABN, First Publish Date - 2022-09-26T03:45:18+05:30

రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌ పోటీలలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠ శాల మైదానంలో రాష్ట్ర స్థాయి 6వ తెలంగాణ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ ఇంటర్‌ డిస్ర్టిక్ట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ గాజుల ముఖేష్‌గౌడ్‌లతో కలిసి ప్రారంభించారు.

బాస్కెట్‌బాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, సెప్టెంబరు 25:  రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌ పోటీలలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలుర  ఉన్నత పాఠ శాల మైదానంలో రాష్ట్ర స్థాయి 6వ తెలంగాణ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ ఇంటర్‌ డిస్ర్టిక్ట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ గాజుల ముఖేష్‌గౌడ్‌లతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పోటీలు మూడు రోజుల పాటు జరుగు తాయన్నారు. క్రీడల ద్వారా మానసికోల్లాసంతోపాటు రోగ నిరోధక శక్తి  పెంపొం దుతుందని, క్రీడలతో భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. చాంపియన్‌షిప్‌ పోటీల్లో  18 జిల్లాల నుంచి 33 జట్లు పాల్గొంటున్నాయని, ఇందులో  15 బాలికల జట్లు,  18 బాలుర జట్లు ఉన్నాయన్నారు. క్రీడల్లో  గెలుపు ఓటములు సహజమన్నారు.  బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డా. చంద్రమోహన్‌గౌడ్‌, సెక్రెటరీ సుకు మార్‌ ఫ్రాన్సిస్‌, రాష్ట్ర కార్యదర్శి నోర్మన్‌ ఇస్సాక్‌, జగన్మోహన్‌రావు, బొలిశెట్టి కిషన్‌, కోచ్‌ ప్రశాంత్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2022-09-26T03:45:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising