ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ కార్యదర్శుల చేతికి డిజిటల్‌ కీ

ABN, First Publish Date - 2022-11-30T22:29:53+05:30

జనన, మరణ ధ్రువపత్రాలను పారదర్శకం గా అందించేందుకు పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్‌ ‘కీ’ సంతకాల అమలుకు ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. ప్ర

లో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లాలో 15 రోజులుగా అమలు

- ప్రజలకు తప్పిన ఇబ్బందులు

బెల్లంపల్లి, నవంబరు 30: జనన, మరణ ధ్రువపత్రాలను పారదర్శకం గా అందించేందుకు పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్‌ ‘కీ’ సంతకాల అమలుకు ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలకు అందజేసే సేవల్లో అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామ పంచాయతీ ద్వారా అందే సేవల్లో డిజిటల్‌ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే డిజిటల్‌ సంతకంతో పలు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ఇటీవల జనన, మరణ ధ్రువపత్రాలను డిజిటల్‌ కీతో జారీ చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో అమలయ్యేలా చర్యలు చేపడుతున్నారు.

- జిల్లాలో 311 పంచాయతీలు..

జిల్లాలో 318 మండలాల్లో 311 గ్రామపంచాయతీలున్నాయి. ఆయా గ్రా మాల పరిధిలో 311 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తు న్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం. ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. కార్యదర్శులు ఇప్పటికే పనిభారంతో ఒత్తిడికి గురవు తున్నారు. ఉపాధిహామీ పథకం, రికార్డుల నిర్వహణ, హరితహారం, ఇంటి పన్నుల వసూలు ఇలా అనేక పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభు త్వం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తూ కార్యదర్శు లకు డిజిటల్‌ సంతకాల కీ విధానాన్ని అమలు చేసింది. ముందుగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను డిజిటల్‌ పద్ధతిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 15 రోజులుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మిగితా సేవలను కూడా డిజిటల్‌ విధానంలో అందించనున్నారు.

- అమలు తీరు ఇలా..

గ్రామాల్లో జనన, మరణ వివరాలను ఎప్పటికప్పుడు పంచాయతీ రికా ర్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా కొంత మంది కార్యదర్శులు సమాచార లోపంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రజలకు ధ్రువీకరణ పత్రాల జారీ సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో అవకతవకలు జరిగిన సం ఘటనలు సైతం ఉన్నాయి. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన డిజిట ల్‌ కీ ద్వారా ఇలాంటి అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉండదు. జనన, మరణ ధ్రువపత్రాలు కావాలంటే దరఖాస్తు చేసిన తర్వాత డిజిటల్‌ కీ లాగిన్‌ ద్వారా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు చూస్తారు. క్షేత్రస్ధాయిలో విచారించిన తర్వాత డిజిటల్‌ సంతకం చేస్తారు. అనంతరం దరఖాస్తు దారులు మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలను తీసుకోవచ్చు. దరఖాస్తులు చేసుకున్న వారి ఫోన్‌కు సైతం మెస్సెజ్‌ వె ళ్తుంది. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మెస్సెజ్‌ వచ్చిన వెంటనే మీ సేవ కేంద్రంలో ధ్రువీకరణ పత్రాలు తీసుకోవచ్చు.

అవకతవకలకు ఆస్కారం ఉండదు..

- నారాయణరావు, జిల్లా పంచాయతీ అధికారి

జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్‌ కీ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రక్రియ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలకు ఆస్కారం ఉండదు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవలను డిజిటల్‌ ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో లాగా ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫోన్‌కు మెస్సెజ్‌ వచ్చిన వెంటనే సంబంధిత ధ్రువీకరణ పత్రాలను తీసుకోవచ్చు.

Updated Date - 2022-11-30T22:29:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising