ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

ABN, First Publish Date - 2022-05-19T05:08:00+05:30

విద్యా రంగాన్ని ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీ ప్రక్రియపై స్పష్టత ఇవ్వడం లేదని ఉపాధ్యాయ సంఘాల పోరట కమిటీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు వెంకట్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, మే 18: విద్యా రంగాన్ని ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీ ప్రక్రియపై స్పష్టత ఇవ్వడం లేదని ఉపాధ్యాయ సంఘాల పోరట కమిటీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు వెంకట్‌ ఆరోపించారు. ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు, పదోన్నతుల షెడ్యుల్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుఽ దవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడుతామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు వెంకట్‌ అన్నారు. వేసవి సెలవులు మరో 15 రోజుల్లో పూర్తవుతాయని, జూన్‌ 1వ తేదీ నుంచి పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆ సమయంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడితే నమోదు ప్రక్రియ కుంటుపడుతుందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు సామ్యుల్‌, శ్రీనివాస్‌, వృకోదర్‌, తొడసం శ్రీనివాస్‌, రామేశ్వర్‌, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T05:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising