ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు

ABN, First Publish Date - 2022-12-16T01:35:45+05:30

భగవత్‌ గీతలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మార్గశిర మాసాన్ని ధనుర్మాసంగా చెప్పుకుం టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 15 : భగవత్‌ గీతలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మార్గశిర మాసాన్ని ధనుర్మాసంగా చెప్పుకుం టారు. సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించి మక రంలోకి వెళ్లే సమయం శుక్రవారం సాయంత్రం 6:18 నిమిషాలకు ధనుస్సు సంక్రమణ జరుగు తోంది. జనవరి 14 వరకు నెల రోజులపాటు శ్రీవైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తారు. 30 రోజులపాటు గోదాదేవి రచించి గానం చేసిన పాశురాలు (తిరుప్పావై) ప్రతినిత్యం ఆలయాల్లో ఆండాళ్‌ తల్లికి పూజలు నిర్వహించి గానం చేస్తారు. గోదాదేవి స్వయంగా తాను శ్రీవ్రతం, కాత్యాయనీవ్రతం, మార్గళి వ్రతం ఆచరించి అనుయాయులతో ఆచరింపజేసింది. ఈ మాసంలో సూర్యత్పూర్యం మేల్కొని విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం మనపై కలుగుతుందని గోదాదేవి నిరూ పించింది. కనుక నెల రోజులపాటు భక్తులు ఆలయాలకు వెళ్లి ధనుర్మా సోత్సవంలో పాల్గొంటారు.

దేవరకోటలో ధనుర్మాసోత్సవం

స్థానిక దేవరకోట లక్ష్మీవెంకటేశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా ఉదయం 5:30 గంటలకు గోదాకృష్ణ అర్చన, తిరుప్పావై సేవాకాలం, తీర్థగోష్టి ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు లింగంపల్లి లక్ష్మీ నారాయణ తెలిపారు. భక్తులు ఈ సేవలో పాల్గొని తరించాలని కోరారు. బాగులవాడలోని రామాలయంలో రామానుజాచార్య పర్యవేక్షణలో ధను ర్మాసోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హరి హర క్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీఽ దర్‌ రెడ్డి వినోదమ్మ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తిరుప్పావై ప్రవచనాలు

స్థానిక శాస్ర్తినగర్‌ హనుమాన్‌ దేవస్థానంలో టికె.రామకన్నన్‌ తిరు ప్పావై ప్రవచనాలు శుక్రవారం నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో జనవరి 14 వరకు నిర్వహించనున్నారు. ధనుర్మాస సందర్భంగా శ్రీవైష్ణవ ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ సంతరిం చుకుంది.

Updated Date - 2022-12-16T01:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising