ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి

ABN, First Publish Date - 2022-05-29T03:58:22+05:30

పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌ మండలంలోని వంజిరి రైతు వేదిక సదస్సులో ఆయన మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ 

కాగజ్‌నగర్‌ రూరల్‌, మే 28: పల్లెప్రగతితో గ్రామాలు  అభివృద్ధి చెందుతాయని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌ మండలంలోని వంజిరి రైతు వేదిక సదస్సులో ఆయన మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలన్నారు. జిల్లా పంచాయతీ కార్యదర్శుల పని తీరుతో పల్లెప్రగతి కార్యక్రమాలతో జిల్లాకు 21వ స్థానం దక్కిందన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో మాతా, శిశు మరణాలు, ఇతర వ్యాధులను నియంత్రించే దిశగా కృషి చేయాలన్నారు. జడ్పీ చైర్మన్‌ కోవలక్ష్మి, సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ పల్లెప్రగతి కార్య క్రమ విజయవంతానికి అంతా కృషి చేయాలన్నారు. ఏడురోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదన్నారు. అదనపు కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్ర మంలో కీలక సమస్యలు పరిష్కరించేట్టు చూడాలన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారులు, సహాయఅధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T03:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising