ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2022-12-07T01:45:33+05:30

ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని న్యాయ, పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

బోరిగాంలో ఆలయం వద్ద మొక్కలు నాటుతున్న మంత్రి అల్లోల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సారంగాపూర్‌, డిసెంబరు 6 : ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని న్యాయ, పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బోరిగాంలో బీరప్ప భీమన్న శివాల యాల విగ్రహ ప్రతిష్టాపనకు హాజరై ఆలయాల్లో ప్రత్యేకపూజలు చేశారు. ఆలయంలో పూజారి తుపాకుల రమణ హారతినిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని దేవాలయాలకు సీఎం కేసీఆర్‌ ఎనలేని కృషి చేస్తున్నారని రాష్ట్రంలో దేవాలయాలన్నీ అభివృద్ధి చెందాయన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణం చరిత్రలో నిలిచి పోతాయన్నారు. ప్రత్యేకఅభివృద్ధి నిధులతో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను, కామన్‌ గుడ్‌ఫండ్‌ నిధులతో దేవాలయాల నిర్మాణ పనులు చేపట్టడం జరిగింద న్నారు. ఆలయ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయడంతోనే ఆల య నిర్మాణాలు జరిగాయన్నారు. గతంలో లేనివిధంగా దేవాలయాలకు నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. దీంతో పాటు గ్రామంలో బీరప్ప, భీమన్న, శివాలయాల అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయించి ఆలయాలు నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ఆలయాల వద్ద మొక్కలను నాటారు. అనంతరం శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రామ్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహి పాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌లు నారాయణరెడ్డి, మాణిక్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మాధవ్‌రావు, నాయకులు రామ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, జీవన్‌రావులతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీ సీలు, నాయకులు, గ్రామస్థులు ఉన్నారు.

Updated Date - 2022-12-07T01:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising