ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలి

ABN, First Publish Date - 2022-01-24T04:31:46+05:30

ఆదివాసుల సంస్కృతీ సంప్ర దాయాలను భావితరాలకు అందించాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మిఅన్నారు. మండలంలోని జంగాంలో జంగోలింగో దీక్షాభుమిని ఆమె ఆదివారం సందర్శిం చారు.

కబడ్డీ పోటీలు ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

జైనూరు, జనవరి 23: ఆదివాసుల సంస్కృతీ సంప్ర దాయాలను భావితరాలకు అందించాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మిఅన్నారు. మండలంలోని జంగాంలో జంగోలింగో దీక్షాభుమిని ఆమె ఆదివారం సందర్శిం చారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనకయాదవ్‌రావ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుంర భగ్వంత్‌రావ్‌ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం జంగోలింగో దీక్షాభూమిలో పీఠాధిపతి కుంర భగ్వంత్‌రావ్‌, ఘనసంస్థాన్‌ సభ్యులఆధ్వర్యంలో జంగో, లింగో దీక్షలు తీసుకున్నారు. అదేవిధంగా గోండి ధర్మం అత్యంత గొప్పదని, వాటి రక్షణకు దోహదప డాలని కోరారు. కార్యక్రమంలో కెరమెరి జడ్పీటీసీసెడ్మకీ ధ్రుప దబాయి, ఘనసంస్థాన్‌ అధ్యక్షుడు రఘునాథ్‌, కోవ లక్ష్మి తనయుడు కోవసాయినాథ్‌, ఆదివాసీ కళాకా రుడు మడావి రాజేశ్వర్‌ భక్తులు పాల్గొన్నారు.

ఆటల్లో గెలుపోటములు సహజం

సిర్పూర్‌(యూ): ఆటల్లో గెలుపోటములు సహజ మని జడ్పి చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. ఆదివారం మండలంలోని పన్‌గడిలో జోరమ్మతల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటలపోటీలతో స్నేహభావం పెరుగు తుందన్నారు. మారుమూల ప్రాంతంలో గ్రామీణ క్రిడా కారుల కోసం ఆటలపోటీలు నిర్వహించడం హర్షనీయ మన్నారు. అంతకుముందు ప్రత్యేకపూజలు నిర్వహిం చారు.  గ్రంథాలయచైర్మన్‌ కనకయాదవ్‌రావు, కెరమెరి జడ్పీటీసీ ధ్రుపదబాయి, సర్పంచులు తోడసం విజయ, మెస్రం భూపతి, ఆత్రం జాలింషా, ఆత్రం మెంగోరావు, ఎంపీటీసీ కుడ్మెత యశ్వంత్‌రావు, కమిటీ అధ్యక్షుడు తోడసం ధర్మారావు, గోండి ధర్మకోయ పూణె రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆత్రం ఆనందరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising