ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటల పరిశీలన

ABN, First Publish Date - 2022-01-22T04:12:49+05:30

బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పౌనూరు, గోపాలపూర్‌, కిష్టాపూర్‌ గ్రామాల్లోని వేరుశనగ పంటలను పరిశీలించారు.

వేరుశనగ పంటను పరిశీలిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్‌, జనవరి 21: బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పౌనూరు, గోపాలపూర్‌, కిష్టాపూర్‌ గ్రామాల్లోని వేరుశనగ పంటలను పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేట ర్‌ డాక్టర్‌ రాజేశ్వర్‌నాయక్‌ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగలో తిక్క ఆకు మచ్చ తెగులును గుర్తించామని, దీని నివారణకు లీట రు నీటికి ఒక మిల్లీలీటరు చొప్పున ట్యూబొకొనజోల్‌ పిచికారి చేయాలన్నారు.  ఐసీజీవీ 00350 రకంలో తెగులు ఉధృతి తక్కువగా ఉందన్నారు. శాస్త్రవేత్త నాగరాజు, ఏవో మార్క్‌ గ్లాడ్సన్‌, ఏఈవో సువర్ణ పాల్గొన్నారు. 

చెన్నూరురూరల్‌: ఆస్నాద్‌ గ్రామంలోని వరి పంటను వ్యవసాయ విస్త రణ అధికారి సాగర్‌ పరిశీలించారు. వరి నాట్లు వేసేటప్పుడు తూర్పు పడమర దిశలో ప్రతీ రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీయాలని, దీంతో గాలి వెలుతురు సక్రమంగా అంది దోమ ఉధృతి తగ్గించుకోవచ్చని సూచించా రు. వరినాట్లు వేసేటప్పుడు కొనలను తుంచితే కాండం తొలుచు పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చన్నారు. 

Updated Date - 2022-01-22T04:12:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising