ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిబంధనలు పాటించాలి

ABN, First Publish Date - 2022-01-15T06:42:01+05:30

కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రజల ను మరింత భయపెట్టేందుకు సిద్ధమైందని, ఈ క్రమంలో తమను సంరక్షించుకోవడానికి ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తునే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌ పట్టణంలోని రైతు బజార్‌, వినాయక్‌చౌక్‌, గాంధీచౌక్‌, అంబేద్కర్‌చౌక్‌, నేతాజీచౌక్‌,

రైతుబజార్‌లో మాస్కులు ధరించాలని సూచిస్తున్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ 

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 14: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రజల ను మరింత భయపెట్టేందుకు సిద్ధమైందని, ఈ క్రమంలో తమను సంరక్షించుకోవడానికి ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తునే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌ పట్టణంలోని రైతు బజార్‌, వినాయక్‌చౌక్‌, గాంధీచౌక్‌, అంబేద్కర్‌చౌక్‌, నేతాజీచౌక్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో పర్యటించి కరోనా నిబంధనలు ప్రజలు పాటిస్తున్నారా? లేదా? అని పరిశీలించారు. ముందు గా రైతుబజార్‌ను సందర్శించిన ఆయన వ్యాపారస్థులు వినియోగదారులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా థర్డ్‌వేవ్‌ వ్యాప్తి చెందుతునందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని కోరా రు. అధికారులు ప్రజల ఆరోగ్యం పై విస్త్రృత అవగాహన కల్పిస్తున్నప్పటికి కనీసం మాస్కులు కూడా ధరించడం లేదన్నారు. జిల్లా సరిహద్దు గల మహారాష్ట్రలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయని అక్కడి నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలినడక వారికి, రైతుబజార్‌లోని వినియోగదారులకు, వ్యాపారులకు మాస్కులు లేని వారికి మాస్కులు పంపిణీ చేశారు. అదే విదంగా వాహనచోదకులు మాస్కులు ధరించని వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయడం జరుగుతుందన్నారు. వైద్యం, పోలీసు, మున్సిపల్‌, పంచాయతీ, రెవెన్యూ శాఖలు ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం అవసరమైన చర్యలు చేపడుతున్నారని ప్రజలు అధికారులకు, ప్రజలకు సహకరించి కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. అదేవిధంగా బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని అదనపు కలెక్టర్‌ బస్సులో ఎక్కి పరిశీలించారు. కాగా జిల్లాలో 15 నుంచి 17 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు తీసుకోవాలని కోరారు. ఇందులో జిల్లా మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్‌, మున్సిపల్‌ డీఈఈ తిరుపతి, పోలీసు అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-01-15T06:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising