ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల భద్రత, సంరక్షణకే కార్డన్‌సెర్చ్‌

ABN, First Publish Date - 2022-01-25T05:55:27+05:30

ప్రజలభద్రత, సంరక్షణకే కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించి నట్లు భైంసారూరల్‌ సీఐ చంద్రశేఖర్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భైంసా రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌

కుభీర్‌, జనవరి 24 :  ప్రజలభద్రత, సంరక్షణకే కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించి నట్లు భైంసారూరల్‌ సీఐ చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని చొండి గ్రామం లో సోమవారం కార్డెన్‌సర్చ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ, భైంసా ఏఎస్పీ ఆదేశాల మేరకు ఉదయం 5 గంటల నుంచే గ్రామంలో 4 గురు ఎస్సైలు, 53మంది పోలీసు సిబ్బంది భాగాలు విడిపోయి గ్రామంలో తనిఖీ చేశారు. సంబంధిత పత్రాలు లేని 61 మోటార్‌సైకిళ్లు, 10 ఆటోలు, ఒక కారు సీజ్‌ చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ నేర నియంత్రణకు పోలీసుల ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు కలిసి మెలసి ఉండి, నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తమ వాహనాలకు సంబంధించి నిజ దృవీకరణ పత్రాలను ఎల్లప్పుడు తమ వెంటనే ఉంచుకోవాలని, సెకండ్‌హ్యాండ్‌ వాహనాలను కొనుగోలు చేసేటప్పుటు వాహనాల ధృవీకరణ పత్రాలను సరిగా చూసుకోవాలన్నారు. తాగి వాహనాలను నడుపవద్దని, ద్విచక్రవాహనాలు నడిపేటప్పుడు హెల్మేట్‌ ధరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు ఎండీ షరీఫ్‌, శ్రీకాంత్‌, సుమంజలి, శ్రీకాంత్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising