ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడతెరిపి లేని వర్షం

ABN, First Publish Date - 2022-08-09T03:51:29+05:30

జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో వాగులు ఉప్పొంగి ప్రవ హిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ జిల్లాలో రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. ప్రాణహిత గోదావరి నదుల్లో భారీగా వరద నీరు చేరడంతో ముంపు ప్రమాదం పొంచి ఉంది. ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వర్షం కారణంగా సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటం కం కలుగుతోంది.

నెన్నెల మండలం ఎర్రవాగును పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొంగుతున్న వాగులు, రాకపోకలకు ఇబ్బందులు

మంచిర్యాల,  ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో వాగులు ఉప్పొంగి ప్రవ హిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ జిల్లాలో రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. ప్రాణహిత గోదావరి నదుల్లో భారీగా వరద నీరు చేరడంతో ముంపు ప్రమాదం పొంచి ఉంది.  ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వర్షం కారణంగా సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటం కం కలుగుతోంది. జిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాలోని ఓసీపీల్లో సోమవారం ఉదయం షిఫ్టులో కేవలం మూడు గంటల పాటు పనులు కొనసాగాయి. వర్షం వల్ల 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా 3.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీ తరలింపు పనులు నిలిచిపోయాయి.   

అధికారులు అప్రమత్తంగా ఉండాలి 

నెన్నెల: భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉం డాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ సూచించారు. సోమవారం లంబాడితండా వద్ద  ఎర్రవాగును పరిశీలించారు.  అధికారులు ప్రాజెక్టులు, చెరువుల కట్టలను పరిశీలించాలన్నారు. గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పడు ఉన్నతాధికారులకు చేరవేయాలని, అవససరమైన చోట సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మండల పరిషత్‌లో ప్రజావేదికలో పాల్గొన్నారు. గైర్హజరైన అధికారుకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. భోజనాన్ని పరిశీలించి మెనూ సక్రమంగా పాటించాలని సూచించారు. ఇంగ్లీష్‌, హింవీ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిం చారు.  పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు. ఆర్డీవో శ్యామలాదేవి, తహసీల్దార్‌ భూమేశ్వర్‌, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్‌, ఏపీవో నరేష్‌ ఉన్నారు. 

వర్షాలకు ఉప్పొంగిన మత్తడి వాగు 

వేమనపల్లి: రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మత్తడి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపో యాయి. వేమనపల్లి-కల్లెంపల్లి మధ్య మత్తడి వాగుపై ఉన్న వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసి  రాకపోకలు సాగించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మళ్లీ వాగు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. ప్రాణహిత నది బ్యాక్‌ వాటర్‌ ఈ వాగులోకే వస్తుంది. వాగు అవతల ఉన్న సుంపుటం, జాజులపేట, కల్లెంపల్లి, ముక్కిడిగూడెం, ఒడ్డుగూడెం గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది.  సోమవారం ఎంపీవో బాపురావు, సర్పంచు కొండగొర్ల బాపు, కార్యదర్శి సిరాజ్‌ లు ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రజలు  వాగు  దాటవద్దని సూచించారు. 

Updated Date - 2022-08-09T03:51:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising