ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువుల కాపరిని అటవీశాఖ అధికారులు చితకబాదారని ఆందోళన

ABN, First Publish Date - 2022-06-25T06:41:49+05:30

పశువుల కాపరిని అటవీశాఖ అధికారులు చితకబాదారని ఆరోపిస్తూ మండలంలోని తర్లపాడ్‌ గ్రామస్థులు శుక్రవారం నిర్మల్‌, మంచిర్యాల్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.

రోడ్డుపై బైఠాయించిన తర్లపాడ్‌ గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ - మంచిర్యాల రహదారిపై ధర్నా

ఖానాపూర్‌, జూన్‌ 24 : పశువుల కాపరిని అటవీశాఖ అధికారులు చితకబాదారని ఆరోపిస్తూ మండలంలోని తర్లపాడ్‌ గ్రామస్థులు శుక్రవారం నిర్మల్‌, మంచిర్యాల్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రతీరోజులాగే పశువుల కాపరి పూసం అన్ను గ్రామంలోని గేదెలను తీసుకొని అటవీ ప్రాంతానికి మేపడానికి వెళ్లాడని, గేదెలను మేపుతుండగా అటవీ అధికారులు అతన్ని పిలిచి చితకబాదారని తెలిపారు. ఆదివాసీ అని చూడకుండా ఓ పశువుల కాపరిని చితకబాదడం సరికాదని, అతనికి న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. నిర్మల్‌, మంచిర్యాల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి సీఐ అజయ్‌బాబు చేరుకొని గ్రామస్థులకు నచ్చజె ప్పడంతో గొడవ సద్దుమణిగింది. పశువుల కాపరిని కొట్టిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సీఐ అజయ్‌బాబు అన్నారు. ఆయన వెంట ఎస్సై రజినీకాంత్‌, పోలీసుసిబ్బంది ఉన్నారు. ఈ విషయంపై ఖానాపూర్‌ ఎఫ్‌డీవో కోటేశ్వరరావును వివరణ కోరగా తర్లపాడ్‌ అటవీప్రాంతంలో గ్రాస్‌ ప్లాంటేషన్‌ ఉన్నాయని, వాటిలో పశువులను మేపకూడదని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, గ్రాస్‌ ప్లాంటేషన్‌లో పశువులను మేపడంతో బెదిరించామే తప్ప ఎవరిపై దాడి చేయలేదని అన్నారు. 

Updated Date - 2022-06-25T06:41:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising