ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన విద్యార్థులకు కంప్యూటర్‌ శిక్షణ

ABN, First Publish Date - 2022-10-26T21:53:10+05:30

సిర్పూర్‌(టి), అక్టోబరు 26: మండలకేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమశాఖ నుంచి 6నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థు లకు విద్యతోపాటు అమెజాన్‌ కంపెనీ సహకారంతో కంప్యూటర్‌ శిక్షణను ఇస్తున్నారు. సిర్పూర్‌(టి) బాలికల వసతి గృహంలో 6నుంచి 9వ తరగతి చదివే 300మంది విద్యా ర్థినులు ప్రత్యేక తరగతుల ద్వారా కంప్యూటర్‌ శిక్షణ పొందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిర్పూర్‌(టి), అక్టోబరు 26: మండలకేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమశాఖ నుంచి 6నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థు లకు విద్యతోపాటు అమెజాన్‌ కంపెనీ సహకారంతో కంప్యూటర్‌ శిక్షణను ఇస్తున్నారు. సిర్పూర్‌(టి) బాలికల వసతి గృహంలో 6నుంచి 9వ తరగతి చదివే 300మంది విద్యా ర్థినులు ప్రత్యేక తరగతుల ద్వారా కంప్యూటర్‌ శిక్షణ పొందుతున్నారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థినులు సులభంగా కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని నేర్చుకునేందుకు ప్రత్యేక మైండ్‌ స్పార్స్‌ అనే అడ్వాన్స్డ్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఉపాధ్యాయుల సాయం లేకుండానే స్వయంగా దీన్ని నేర్చుకోవచ్చు. ఈ శిక్షణ విద్యార్థు లలో సాంకేతిక విజ్ఞాన సామర్థ్యాన్ని పెంపొందించ డంతో పాటు భవిష్యత్‌లో ఇంగ్లీష్‌ భాషలో ప్రావీణ్యం సాధించడానికి ఉపయోగపడుతుందంటున్నారు. గణితంలో విద్యార్థులకు ఆసక్తిని పెంచుతుంది. దీంతో పాటు భవిష్యత్‌లో ఆదివాసీ గిరిజన అడవి బిడ్డలకు పైచదువులకు ఎంతో దోహదపడుతుంద న్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఈ కంప్యూటర్‌ శిక్షణ ద్వారా గిరిజన పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు.

శిక్షణతో ఉపయోగాలు..

సాంకేతిక విద్యతో విద్యార్థుల్లో ఏకాగ్రతతోపాటు విద్యపై ఆసక్తి కలుగుతుంది. ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెకులలో సామర్థ్యాలు పెరుగుతాయి. అక్షర దోషాలు నివారించవచ్చు. ఉన్నత విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు బాసటగా నిలుస్తుంది. విషయ పరిజ్ఞానం పెరుగుతుంది.

బాలికల్లో విద్యా ప్రమాణాల పెంపు

- బాబురావు, ప్రధానోపాధ్యాయుడు

బాలికల్లో విద్యా ప్రమా ణాలు పెంచేందుకు ప్రభుత్వ బాలికల గిరిజన పాఠశాలలో కంప్యూటర్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. విద్యతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం పెంపొందించేందుకు గిరిజన శాఖ అవకాశాలు కల్పిం చింది. బాలికలు కూడా ఉత్సాహం కనబరుస్తున్నారు. ఉన్నతవిద్యకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది.

Updated Date - 2022-10-26T21:53:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising