ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2022-12-10T01:42:38+05:30

జిల్లాకేంద్రంలో శుక్రవారం ఏఐసీసీ కార్య క్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

నిర్మల్‌లో కేక్‌ను కట్‌ చేస్తున్న ఏఐసీసీ నేత ఏలేటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ అర్బన్‌, డిసెంబరు 9 : జిల్లాకేంద్రంలో శుక్రవారం ఏఐసీసీ కార్య క్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సంద ర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ విజయం సోనియాగాంధీకి పుట్టినరోజు కానుక అని పేర్కొన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి మదర్‌ ఆఫ్‌ తెలంగాణ సోనియాగాంధీకి తెలం గాణలోనూ గెలిపించి కానుకగా ఇస్తామని అన్నారు. దేశప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోతున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పాలన రావడం తథ్యమన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజలు బీజేపీని ఓడించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, రేపు తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెడుతారని ఆశాభావం వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు నాందేడపు చిన్ను, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముత్యం రెడ్డి, అయ్యన్నగారి పోశెట్టి, జునైద్‌, ప్రముఖ న్యాయవాది నిర్మల, ఉదయ్‌ గౌడ్‌, ప్రజ్యోత్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising