ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి

ABN, First Publish Date - 2022-09-28T05:49:41+05:30

మలిదశ తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్‌బాపూజీ అని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ అన్నారు. కొండ లక్ష్మణ్‌బాపూజీ 107వ జయంతి వేడుకలను మంగళవారం అధికారికంగా నిర్వహించగా

బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 27: మలిదశ తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్‌బాపూజీ అని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ అన్నారు. కొండ లక్ష్మణ్‌బాపూజీ 107వ జయంతి వేడుకలను మంగళవారం అధికారికంగా నిర్వహించగా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించా రు. అనంతరం ఆ మహానీయుడు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ మేర కు జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ క్విట్‌ ఇండియా ఉద్యమంతో పాటు తెలంగాణ మలిదశ పోరాటంలో పాల్గొన్న మహానీయుడు ఉమ్మడి జిల్లా వాసి కావడం జిల్లాకే గర్వకారణమని అన్నారు.  తర్వాత కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహానీయుడు బాపూజి అని అన్నారు.  

ఆదిలాబాద్‌ టౌన్‌: క్వింట్‌ ఇండియా ఉద్యమం తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ కీలకపాత్ర వహించారని జడ్పీ చైర్మన్‌ జనార్ధన్‌ రాథోడ్‌ అన్నారు. మంగళవారం జడ్పీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. 

అలాగే, ఆలాదిలాబాద్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో, ఉట్నూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో, బోథ్‌ మండల కేంద్రంలో స్థానిక పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలోనూ కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని నిర్వహించారు.

Updated Date - 2022-09-28T05:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising