ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీఐ అమ్మకానికి కాదు : ఎంపీ

ABN, First Publish Date - 2022-05-23T06:21:32+05:30

దేశవ్యాప్తంగా ఉన్న సిమెంట్‌ పరిశ్రమల్లోని స్థితిగతులను తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం టెండర్‌ ప్రక్రియ చేపట్టిందే తప్ప అమ్మకానికి కాదన్న విషయాన్ని గ్రహించాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయంబాపురావ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆదిలాబాద్‌టౌన్‌, మే22: దేశవ్యాప్తంగా ఉన్న సిమెంట్‌ పరిశ్రమల్లోని స్థితిగతులను తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం టెండర్‌ ప్రక్రియ చేపట్టిందే తప్ప అమ్మకానికి కాదన్న విషయాన్ని గ్రహించాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయంబాపురావ్‌ అన్నారు. సీసీఐ భూ నిర్వాసితులు ఆదివారం ఎంపీని కలిసి వారి సమస్యలను తెలియజేసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిశీలించి తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 5 సిమెంట్‌ పరిశ్రమల్లోని యంత్రాలు, ఇతర సామాగ్రి పున: ప్రారంభంలో పనికి వస్తాయా లేదా అనే అంశంపై ఈ టెండర్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిశ్రమను మూసివేయడానికికాదన్న విషయాన్ని గ్రహించాలని కోరారు. టెండర్‌ విధానం పై జూన్‌ 8న ఢిల్లీలో సమావేశం ఉందని పూర్తి స్థాయి విషయాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 26న ప్రధానమంత్రి హైదరాబాద్‌ ప ర్యటన ఉందని భూ నిర్వాసితుల సమస్యను పీఎంకు వివరించనున్నట్లు తెలిపారు. రైతులకు నష్టం కలుగకుండా తనవంతుగా పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఇందులో భూ నిర్వాసితుల సంఘం ప్రతినిధులు అరవింద్‌, విఠల్‌, అశోక్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-05-23T06:21:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising