ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి వ్యాపారులపై సీబీఐ నిఘా

ABN, First Publish Date - 2022-09-11T05:16:04+05:30

జిల్లా పత్తి వ్యాపారులపై సీబీఐ అధికారులు నిఘా సారించినట్లు తెలుస్తోంది. ఈమేరకు జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారులకు నోటీసులు జారీ అ యినట్లు తెలిసింది. త్వరలోనే సీబీఐ అధికారులు విచారణ చేపట్టే అవ కాశం ఉందన్న చర్చ జరగుతుంది. 2017-18, 2018-19 రెండేళ్లలో సుమా రు రూ.400 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురు వ్యాపారులకు నోటీసులు జారీ

రెండేళ్లలో రూ.400 కోట్ల అవినీతి

జిల్లా వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అవినీతి బాగోతం

ఆదిలాబాద్‌, సెప్టెంబరు10(ఆంధ్రజ్యోతి): జిల్లా పత్తి వ్యాపారులపై సీబీఐ అధికారులు నిఘా సారించినట్లు  తెలుస్తోంది. ఈమేరకు జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారులకు నోటీసులు జారీ అ యినట్లు తెలిసింది. త్వరలోనే సీబీఐ అధికారులు విచారణ చేపట్టే అవ కాశం ఉందన్న చర్చ జరగుతుంది. 2017-18, 2018-19 రెండేళ్లలో సుమా రు రూ.400 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దూది శాతంలో భారీగా తేడాలు రావడంతో అవినీతి జరిగినట్లు ని ర్ధారిస్తున్నారు. ఆదిలాబాద్‌ సెంటర్‌లోని సెక్షన్‌-ఏ, సెక్షన్‌-బీలో కొందరు సీపీవోలు కిందిస్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వ స్తున్నాయి. సీసీఐ అధికారులతో వ్యాపారులు కుమ్మక్కై అవినీతికి తెరలే పారన్నా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులతో చేతులు కలిపి న వ్యాపారులు ప్రభత్వానికి కోట్ల రూపాయల ఆదాయానికి గండికొట్టిన ట్లు తెలుస్తుంది. క్వింటాలుకు కిలోన్నర చొప్పున, 10 క్వింటాళ్లకు 15 కిలో ల వరకు అదనంగా దండుకున్నారన్న అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇలా జిల్లాలో వేల క్వింటాళ్ల పత్తి పంటను సీసీఐ కొనుగోలు చేసింది. మొత్తానికి రెండేళ్లలోనే కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ప్రముఖ వ్యాపారులు సీబీఐ అధికారుల నుంచి నోటీసులు అందడంతో తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై కొందరు వ్యాపారులు ఢి ల్లీకి కూడా వెళ్లివచ్చినట్లు సమాచారం.

Updated Date - 2022-09-11T05:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising