ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ తల్లి హీరాబెన్‌ మృతి పట్ల బీజేపీ నాయకుల సంతాపం

ABN, First Publish Date - 2022-12-31T02:08:28+05:30

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మృతి చెందడంతో శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో సంతాపం ప్రకటించారు.

జిల్లా కేంద్రంలో నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ టౌన్‌, డిసెంబరు 30 : భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మృతి చెందడంతో శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో సంతాపం ప్రకటించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఇంచార్జి రావుల రాంనాథ్‌, పార్లమెంట్‌ కన్వీనర్‌ అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిసెమ్మె రాజు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్‌, బీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అమరవేణి నర్సాగౌడ్‌, అసెంబ్లీ కన్వీనర్‌ ఎన్‌. మురళి, పట్టణ అధ్యక్షుడు సాధం అరవింద్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్‌, నరేష్‌, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తోట సత్యనారాయణ, సీనియర్‌ నాయకులు ఒడిసెల శ్రీనివాస్‌, అయ్యన్నగారి రాజేందర్‌, సంతోష్‌ రాజ్‌, హనుమంత్‌ రాజ్‌, కే. దేవేందర్‌, బాబా, తదితరులు ఉన్నారు.

భైంసా : విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్ధ జీవితాన్ని గడిపిన ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ మహోన్నత మాతృమూర్తి అని బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రతినిధి బోస్లే మోహన్‌రావ్‌ పాటిల్‌, భైంసా పట్టణ అద్యక్షులు ఎనుపోతుల మల్లేశ్వర్‌ అభివర్ణించారు. ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మృతికి సంతాపంగా శుక్రవారం భైంసాలోని ఎస్‌ఎస్‌ జిన్నింగ్‌ ఫ్యాక్టరీలో రాంరావ్‌ పాటిల్‌, దారాబ్జీ జిన్నింగ్‌ ఫ్యాక్టరీలో బోస్లే మోహన్‌రావ్‌ పాటిల్‌, పార్టీ జిల్లా అద్యక్షురాలు పి.రమాదేవి నివాసంలో బైంసా పట్టణ అధ్యక్షులు ఎనుపోతుల మల్లేష్‌ల ఆధ్వర్యంలో వేర్వేరుగా కార్యక్రమాలు జరిగాయి.

మూడు కేంద్రాల్లో వేర్వేరుగా జరిగిన సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ శ్రేణులు, వివిధ సంఘాల ప్రతినిధులు హీరాబెన్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతికి చేకూరాలని మౌనం పాటించారు.

Updated Date - 2022-12-31T02:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising