ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ మహిళలకు బెయిల్‌

ABN, First Publish Date - 2022-06-09T06:26:23+05:30

పోడు వ్యవసాయం చేసుకునే వారికి పట్టాలు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాలు సురేఖ ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న దండేపల్లి మండలం కోయపోశగూడకు చెందిన ఆదివాసీ మహిళలకు బెయిల్‌ మంజూరైంది. కాగా బుధవారం బెయిల్‌ పేపర్లను ఆమె తీసుకువచ్చి అధికారులకు అందించి

జిల్లా జైలు నుంచి బయటకు వస్తున్న ఆదివాసీ మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 8: పోడు వ్యవసాయం చేసుకునే వారికి పట్టాలు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాలు సురేఖ ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న దండేపల్లి మండలం కోయపోశగూడకు చెందిన ఆదివాసీ మహిళలకు బెయిల్‌ మంజూరైంది. కాగా బుధవారం బెయిల్‌ పేపర్లను ఆమె తీసుకువచ్చి అధికారులకు అందించి విడుద ల చేయించారు. బయటకు వచ్చిన 12 ఆదివాసీ మహిళలను కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సన్మానించాయి. పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపడం దారుణమని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు సురేఖ అన్నారు. వారం రోజులుగా జైలులో ఉన్న 12 మందికి బెయిల్‌ మంజూరైందన్నారు. పల్లె ప్రగతి వనాల పేరిట పోడు సాగుదారుల పై దౌర్జన్యం చేసిన అటవీ శాఖ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వీరికి అండగా కాంగ్రెస్‌ ఉంటూ హక్కులను సాధించే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. 2002 నుంచి పోడు సాగుతున్నామని ఆదివాసీ మహిళ తెలిపారు. కాని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తమను భూముల నుంచి వెళ్లగొట్టేల అటవీ శాఖ అధికారులతో దాడులు, కేసులు పెట్టిస్తోందన్నారు. అటవీ వనరులపై ఆదివాసీలకే పూర్తి హక్కులున్నాయని, ఎన్ని కేసులు పెట్టినా సాగును మాత్రం ఆపబోమని స్పష్టం చేశారు. ఇందులో ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత, నాయకులు గంగాధర్‌, అశోక్‌, కల్చప్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, నర్సింగ్‌రావ్‌, పొచ్చన్న, అంబకంటి అశోక్‌, అశోక్‌రెడ్డి, కోటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-09T06:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising