ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల ఎదుగుదలపై శ్రద్ధ చూపాలి

ABN, First Publish Date - 2022-10-18T03:22:35+05:30

పిల్లల ఎదుగుదలపై అధికారులు, సర్పంచ్‌లు శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమాగార్డెన్‌లో సోమవారం పలు శాఖల అధికారులు, సర్పంచ్‌లతో సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంట ర్‌లో ప్రతీ నెల 5న నిర్వహించే గ్రోత్‌ మానిటరింగ్‌ కార్యక్రమంలో వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు పరీ క్షలో సర్పంచ్‌లు పాల్గొని వివరాలను సేకరించాల న్నారు.

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ భారతీ హోళీకేరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రి, అక్టోబరు 17: పిల్లల ఎదుగుదలపై అధికారులు, సర్పంచ్‌లు శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమాగార్డెన్‌లో సోమవారం పలు శాఖల అధికారులు, సర్పంచ్‌లతో సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంట ర్‌లో ప్రతీ నెల 5న నిర్వహించే గ్రోత్‌ మానిటరింగ్‌ కార్యక్రమంలో వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు  పరీ క్షలో సర్పంచ్‌లు పాల్గొని వివరాలను సేకరించాల న్నారు. లోప పోషణ కలిగి ఉంటే వారి బాధ్యత  సర్పంచ్‌లు తీసుకోవాలని తెలిపారు. ప్రతీది డబ్బు లతో కూడుకున్నది కాదని మానవత్వంతో ఆలోచిం చి, అవసరమైతే వారిని దత్తత తీసుకొని కొన్ని నెలలు పోషణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 192 మంది (స్యామ్‌)ఆరోగ్య సమస్య ఎక్కువ ఉన్న వారు, అలాగే 1131 మంది (మ్యామ్‌) ఆరోగ్య సమస్య తక్కువగా ఉన్న వారుగా గుర్తించారన్నారు. ఇప్పుడు చేపట్టే సర్వే కచ్చితంగా ఉండాలని, లేని పక్షంలో ఆరోగ్యకరమైన సమాజా న్ని తీర్చిదిద్దలేమన్నారు. గ్రామాలలో, పట్టణాలలో బాల్య వివాహాలను అడ్డుకోవాలని, సర్పంచ్‌లు తప్ప నిసరిగా వివాహాలను రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుబ్బారాయుడు, సీఈవో నరేం దర్‌, డీఈవో వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారి నారాయణరావు, డీఆర్‌డీవో శేషాద్రి, సంక్షే మ అధికారి చిన్నయ్య, అంజన్‌రావు  పాల్గొన్నారు. 

భూసమస్యలను పరిష్కరించాలి 

దండేపల్లి: ధరణి పోర్టల్‌ ద్వారా వచ్చే దరఖాస్తు లను త్వరగా పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. తహ సీల్దార్‌ కార్యాలయాన్ని సోమవారం తనిఖీ చేశారు.  రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ధరణి పోర్టల్‌ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలపై తహసీఈల్దార్‌ హన్మంతరావును అడిగి తెలుసుకున్నారు.  మండల ప్రత్యేధికారి ప్రకాష్‌జాధవ్‌,   సిబ్బంది ఉన్నారు.  

Updated Date - 2022-10-18T03:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising