ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్టహాసంగా గురుకుల విద్యార్థుల క్రీడలు

ABN, First Publish Date - 2022-10-18T05:28:57+05:30

ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల లోని గిరిజన గురుకుల విద్యార్థుల జోనల్‌స్థాయి క్రీడాపోటీలు సోమవారం మం డలంలోని లాల్‌టెకిడి గురుకుల కళాశాల ఆవరణలో అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి 257 మంది, నిజామాబాద్‌

క్రీడా జ్యోతిని అందిస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాల్‌టెకిడిలో ప్రారంభమైన జోనల్‌స్థాయి క్రీడా పోటీలు 

పాల్గొన్న ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల క్రీడాకారులు

ఉట్నూర్‌, అక్టోబరు 17: ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల లోని గిరిజన గురుకుల విద్యార్థుల జోనల్‌స్థాయి క్రీడాపోటీలు సోమవారం మం డలంలోని లాల్‌టెకిడి గురుకుల కళాశాల ఆవరణలో అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి 257 మంది, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి 151 మంది, మెదక్‌ ఉమ్మడి జిల్లా నుంచి 123 మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌తో పాటు అథ్లెటిక్స్‌ పోటీలను నిర్వహిస్తున్నామని క్రీడల కన్వీనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే రేఖానాయక్‌

లాల్‌టెకిడి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జోనల్‌స్థాయి క్రీడా పోటీలను ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ క్రీడాకారులకు అవసరమయ్యే షూస్‌ అందించడానికి కృషి చేస్తానని అన్నారు. తాను కూడా విద్యార్థి దశలో ఖోఖో, వాలీబాల్‌ పోటీలలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మంచి క్రీడా ప్రతిభను చాటుకోని విద్యార్థులు క్రీడలలో ఎ దుగాలని ఆకాంక్షించారు. ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ గెలుపు, ఓట మిలు సహజమని, ఓడిన వారు నిరుత్సాహనికి గురికాకుండా మళ్లీ గెలువాలన్న తపనతో ప్రాక్టీస్‌ చేయాలని అన్నారు. క్రీడాకారులందరు ఉత్సహంగా క్రీడా పోటీ లలో పాల్గొని ఉత్తమ పేరు తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌ కనక లక్కెరావు, ఆదిలాబాద్‌ ఆర్సీవో గంగాధర్‌, క్రీడల కన్వీనర్‌ భిక్షమయ్య, పరిశీలకులుగా వచ్చిన  గురుకుల డిప్యూటి సెక్రెటరీ ఉమా దేవి, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ మాషూక్‌అలీ, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్‌ ఎంపీపీ దావులే బాలాజీ, సర్పంచ్‌ హరినాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కందుకూరి రమేష్‌, సింగారే భరత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:28:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising