ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీలపై దాడులు సరికాదు

ABN, First Publish Date - 2022-06-28T04:13:55+05:30

ఆదివాసీ, పేదలపై అటవీ శాఖ అధికారులు దాడుల చేయడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొ న్నారు. సోమవారం పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ, గిరిజనుల రైతులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ శాఖ అధికారుల ద్వారా ఆదివాసీ, పేదలపై దాడులు, దౌర్జన్యాలు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టరేట్‌ ధర్నాలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 27: ఆదివాసీ, పేదలపై అటవీ శాఖ అధికారులు దాడుల చేయడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొ న్నారు. సోమవారం పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ, గిరిజనుల రైతులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ శాఖ అధికారుల ద్వారా ఆదివాసీ, పేదలపై దాడులు, దౌర్జన్యాలు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దండేపల్లి మండలం కోయపోచగూడెంలోని ఆదివాసీ మహిళలు, చంటి పిల్లల తల్లులను జైలులో పెట్టడం హేయమైన చర్యఅన్నారు. ప్రభుత్వాల అం డతో అటవీశాఖ అధికారులు పోడు భూములను సాగు చేసుకోనివ్వడం లేద న్నారు. ఆదివాసీ, పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రా లు ఇవ్వడం లేదన్నారు. క్రీడా మైదానాల పేరుతో పేదల భూములను, ఇంటి స్థలాలను లాక్కుంటున్నారని ఇది సరైంది కాదన్నారు. అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, పింఛన్‌లు మంజూరు చేయడం లేదని, దళిత బంధుని అధి కార బంధువుగా చేశారని తెలిపారు.  నాయకులు బండారి రవికుమార్‌, ఆశన్న,  ఎర్మ పున్నం, సంకె రవి, ఆదివాసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T04:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising