కన్నుల పండువగా.. అత్యంత వైభవంగా మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ
ABN, First Publish Date - 2022-12-16T01:38:21+05:30
బంగల్‌పేట్‌లో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవో పేతంగా, శాస్త్రయుక్తంగా నిర్వహించారు.
నిర్మల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : బంగల్‌పేట్‌లో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవో పేతంగా, శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అత్యంత సుందరంగా నిర్మించిన ఆలయంలో నాలుగు రోజుల పాటు వేద మంత్రోశ్చారణలతో విగ్రహప్రతిష్ఠ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యే కపూజలు నిర్వహించారు. ప్రతిష్ఠ కార్య క్రమాల్లో నిర్మల్ పట్టణ, వివిధ గ్రామా లకు చెందిన అనేక మంది ప్రజలు తరలివచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.... సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ రాష్ట్రం దైవభూమిగా మారుతున్నదన్నారు. భగవంతుని ఆశీస్సు లతో, దైవభక్తుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిర్మల్ నియోజక వర్గంలో 132 గ్రామపంచాయతీల్లో, 42 వార్డుల్లో ఇలా ప్రతీ ఊరికి, వార్డుకు ఒక దేవాలయాలను నిర్మించామని తెలి పారు. సుమారు రూ. 3 కోట్లతో కృష్ణ శిలలతో మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని పునఃనిర్మించామని చెప్పారు. ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్ట కార్య క్రమాల్లో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మంత్రి ధన్యవాదాలు తెలి పారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్‌రెడ్డి, ప్రముఖ పారి శ్రామికవేత్త అల్లోలమురళీధర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ కే.విజయలక్ష్మి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మహాలక్ష్మి ఆలయ చైర్మన్ కుడుకల గంగాధర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T01:38:23+05:30 IST