ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుతడి పంటల పరిశీలన

ABN, First Publish Date - 2022-02-04T04:06:59+05:30

మండలంలో సాగు చేస్తున్న ఆరుతడి పంటలను గురువారం వ్యవసాయాధికారులు పరిశీలించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయం, బెల్లంపల్లి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గొల్లపల్లి, బుద్దిపెల్లి గ్రామాల్లో సాగు చేసిన వేరుశనగ, పొద్దు తిరుగుడు, మినుము, జనుము పంటలను పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజేశ్వర్‌ నాయక్‌ మాట్లాడుతూ వేరుశనగ పూత సమయంలో డిప్సం ఎకరానికి 200 కిలోల చొప్పున వాడడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు

పొద్దు తిరుగ పంటను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజీపూర్‌, ఫిబ్రవరి 3 : మండలంలో సాగు చేస్తున్న ఆరుతడి పంటలను గురువారం వ్యవసాయాధికారులు పరిశీలించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయం, బెల్లంపల్లి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గొల్లపల్లి, బుద్దిపెల్లి గ్రామాల్లో సాగు చేసిన వేరుశనగ, పొద్దు తిరుగుడు, మినుము, జనుము పంటలను పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజేశ్వర్‌ నాయక్‌ మాట్లాడుతూ వేరుశనగ పూత సమయంలో డిప్సం  ఎకరానికి 200 కిలోల చొప్పున వాడడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జింక్‌లోపం తలెత్తే అవకాశాలున్నందున లీటరు నీటికి రెండు గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ కలిపి పిచికారి చేయాలని సూచించారు. పొద్దు తిరుగుడులో పొగాకు లద్దె పురుగు ఆశించే అవకాశం ఉన్నందున ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలన్నారు.  యాసంగిలో సాగు చేస్తున్న మొక్కజొన్నను కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉన్నందున ఎకరాకు 8 వరకు లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలన్నారు. పురుగు ఉధృతిని బట్టి లీటరు నీటికి 0.5 ఇమాయోక్టిన్‌బెంజోయెట్‌ మందును కలిపి పిచికారి చేయాలని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు, మండల వ్యవసాయాధికారి మార్గం రజిత, ఏఈవో కనకరాజు, రైతులు పాల్గన్నారు. 

Updated Date - 2022-02-04T04:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising