అకాల వర్షంతో అన్నదాత అరిగోస
ABN, First Publish Date - 2022-12-15T22:46:44+05:30
చింతలమానేపల్లి, డిసెంబరు 15: మాండస్ తుఫాను ప్రభావంతో జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు తడిసి ముద్దయ్యాయి. ముఖ్యంగా పత్తిపంట తీవ్రంగా తడిసిపోవడంతో రంగుమారడం, బరువు తగ్గిపోవడం దిగుబడి తీవ్రంగా తగ్గే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
- జిల్లాలో మాండస్ ప్రభావంతో కురిసిన వర్షం
- తడిసి ముద్దయిన పత్తి, వరిపంటలు, నేలకొరిగిన మిరప పంట
- రంగు మారిన వరి, పత్తి
- దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం
చింతలమానేపల్లి, డిసెంబరు 15: మాండస్ తుఫాను ప్రభావంతో జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు తడిసి ముద్దయ్యాయి. ముఖ్యంగా పత్తిపంట తీవ్రంగా తడిసిపోవడంతో రంగుమారడం, బరువు తగ్గిపోవడం దిగుబడి తీవ్రంగా తగ్గే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్ప టికే వరికోతలు చాలామంది రైతులు పూర్తిచేయగా కల్లాలోని ధాన్యం తడిసిపోయింది. చింతలమానేపల్లి మండలంలోని పలుగ్రామాల్లో సాగుచేసిన మిరప పంటలు కూడా నేలకొరిగాయి.మండలంలో మునుపె న్నడూ లేని విధంగా ఈ ఏడాది సుమారు 250ఎకరాల్లో మిరపపంటలు సాగుచేశారు. కాత, పూతదశలో ఉన్న మిరపపంటకు అకాలవర్షం తీవ్రనష్టం చేకూర్చింది. దీంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ప్రతీఏడాది వాతావరణ పరిస్థి తుల కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వాలు ఆదుకోవ డం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో 4,21,494 ఎకరాల్లో వివిధ పంటల సాగు
జిల్లాలో వివిధపంటలు పంటలు మొత్తం 4,21,494 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఇందులో పత్తి3,15,559, వరి54,960, కంది36,745, సోయా9,186, జొన్న2,934, పెసర2,110 ఎకరాల్లో సాగయ్యాయి. రైతులు పత్తి,వరిసాగుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. గతేడాది సైతం దిగుబడులు సరిగా రాకపోవడంతో ఈఏడా దైనా కలిసొస్తుందనిఆశతో సాగు చేపట్టారు. కానీ వాతా వరణ పరిస్థితులు, ప్రకృతీ వైపరత్యాలు రైతులకు తీవ్రం గా నష్టం కలిగిస్తున్నాయి. చేతికొచ్చిన పంట తడిసి ముద్దయి నల్లబారుతుండ డంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎంతోకొంత దిగుబడి వస్తుందనుకున్న సమయంలో రంగు మారడంతో దళారులు ధరను తగ్గించి అడుగుతున్నారు. మొదట 10వేలు పలికిన పత్తి ధర క్రమంగా తగ్గుతూ ధర రూ. 8000- 8,300 మాత్రమే పలుకుతోంది. రంగు మారిన పత్తి పంటకు కేవలం ధర రూ. 6500 నుండి 7000 మాత్రమే ధర చెల్లిస్తామని దళారులు చెప్పుతుండడంతో పెట్టిన ఖర్చులు సైతం వచ్చేలా లేవన్న సందేహం రైతుల్లో నెలకొంది.
రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి..
పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులకు ఏటా పెట్టుబడి రూపంలో రైతుబంధు ఎకరాలకు రెండుదఫాలు రూ.10వేలు ఇస్తున్నా భూములు ఉన్న రైతు లకు మాత్రమే ఆ సొమ్ము చెందుతోందని తమ పరిస్థితి దారుణమని కౌలు రైతులు వాపోతున్నారు. అకాలవర్షాలతో పంటలు నష్టపోతే వ్యవ సాయం చేస్తున్న రైతాంగాన్ని ప్రత్యేకంగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవా లని ఏటా నష్టపోతున్నామని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పత్తి తడిసి రంగు మారుతోంది..
- రంగన్న, రైతు, కర్జెల్లి
మాండస్ తుఫాను ప్రభావంతో సోమ వారం కురిసిన అకాల వర్షానికి పత్తి పూర్తిగా తడిసిముద్దయింది. రంగు మారింది. ఐదు ఎకరాల్లో చేతికొచ్చిన పంట తీవ్రంగా నష్టపోయాను. ధర కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి.
Updated Date - 2022-12-15T22:46:45+05:30 IST