ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ముగిసిన అఖండ హరినామ సప్తాహం

ABN, First Publish Date - 2022-04-24T07:22:02+05:30

మండలంలోని బెంబర్‌ గ్రామంలో ఏడు రో జులుగా కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం శనివారం రోజు ఘనంగా ముగిసింది.

సప్తాహలో ప్రవచనాలు చెబుతున్న యోగేష్‌ మహారాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తానూర్‌, ఏప్రిల్‌ 23 :  మండలంలోని బెంబర్‌ గ్రామంలో ఏడు రో జులుగా కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం శనివారం రోజు ఘనంగా ముగిసింది. ఈ అఖండ హరినామ సప్తహ ఆధ్మాత్మిక కార్య క్రమంలో భాగంగా బ్రహ్మముహుర్తాన స్వామి వారికి కాఖడహారతితో పాటు ప్రత్యేకపూజలు చేశారు. మహారాష్ట్రకు చెందిన యోగేష్‌ మహారాజ్‌ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుందని పేర్కొన్నారు. దైవ నామస్మరణ చేస్తే భగవంతునికి ప్రీతి పాత్రులవుతా రన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలని సూచించారు. ప్రతి సంవత్సరం గ్రామంలో అఖండహరినామ సప్తాహం నిర్వహించడం వలన ప్రతి ఒక్కరిలో ఆఽధ్యాత్మిక భావనలతో పాటు క్రమశిక్షణ, జీవన వి ధానంలో మార్పు వచ్చి, వ్యవసనాలకు, దురలవట్లకు దూరంగా ఉండటా నికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. గ్రామానికి చెందిన మాధవ్‌ రావు అనే భక్తుడి ఆధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో దిగంబర్‌ గురూజీ, రామరావుమహారాజ్‌ నాందెడ్‌కర్‌, శంకర్‌ పాటిల్‌, సర్పంచ్‌ బాలాజీ, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, మాజీ ఉప సర్పంచ్‌ శంకర్‌, నాయకులు లక్ష్మణ్‌, విఠల్‌, గ్రామస్తులు తదితరులు హాజరై ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిలకించారు.

Updated Date - 2022-04-24T07:22:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising