ఆదివాసీలు సంస్క ృతి, సంప్రదాయలను కొనసాగించాలి
ABN, First Publish Date - 2022-12-31T23:14:08+05:30
ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులందరు తమ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ భావితరాలకు అందించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు.
ఉట్నూర్, డిసెంబరు31: ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులందరు తమ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ భావితరాలకు అందించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శనివారం స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా గోండ్వాన రాయిసెంటర్ 36వ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. గిరిజనుల సంప్రదాయాలు చాలా గొప్పవని కొనియాడారు. రాయిసెంటర్ల ఏర్పాటుతో గిరిజనులందరు ఒకే మాటపై కట్టడి చేసుకొని పాటించడం హర్షనీయమన్నారు. ప్రభుత్వం సైతం గిరిజనుల పండుగలకు ప్రాధాన్యమిస్తుందన్నారు. ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా ఉమ్మడి జిల్లాలోని గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. గిరిజన విద్యాభివృద్ధి కోసం ఆశ్రమ పాఠశాలలు నెలకొల్పినట్లు తెలిపారు. గిరిజనులు పండ్లతోటల పెంపకం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయం పెంపొందించుకోవడానికి కావాల్సిన పథకాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కెరావు, డాక్టర్ చందు, రాయిసెంటర్ జిల్లా మేడి దుర్గు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T23:14:10+05:30 IST