ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించాలి

ABN, First Publish Date - 2022-09-30T04:04:10+05:30

ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు.

మాట్లాడుతున్న ఎస్పీ సురేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 29: ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. గురు వారం ఆసిఫాబాద్‌, వాంకిడి, రెబ్బెన, తిర్యాణి ఆది వాసీపటేళ్లు, గోండ్వాన రాయిసెంటర్‌ సర్‌మేడీలు, సభ్యులతో జిల్లాకేంద్రంలోని టాటియా ఫంక్షన్‌హాల్‌లో పోలీసులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాశ్వతంగా ఉండే వ్యవస్థలే సహయం చేస్తాయన్నారు. త్వరలో జిల్లా ప్రజలకోసం కంటిపరీక్షలు, జైపూర్‌ కృత్రిమకాళ్ల మార్పిడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మావోయిస్టులు గిరిజనప్రాంత ప్రజల అభివృద్ధికి అడ్డంకులు అని అన్నారు. ప్రభుత్వం ద్వారా జరిగే సహాయాన్ని వాళ్లు అడ్డుకుంటారని తెలిపారు. ఈ మధ్యకాలంలో మారుమూలగ్రామాల్లో మావోయిస్టుల అలజడి మొదలైందన్నారు. వారి ఉనికిని చాటేందుకు ప్రవేశించారన్న వార్తలువస్తున్నాయన్నారు. గ్రామాల్లోకి వారిని రానివ్వద్దన్నారు. ఎవరైనా కొత్తవారు, మావో యిస్టులు వస్తే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చినవారికి పారితోషికం ఇస్తామన్నారు. రాయిసెంట ర్‌ సర్‌మేడీలను ఎస్పీతోపాటు డీఎస్పీశ్రీనివాస్‌, పోలీ సులుశాలువాలతో సన్మానించారు. సీఐలు రాణాప త్రాప్‌, శ్రీనివాస్‌, నరేందర్‌, ఎస్సైలురమేష్‌, భూమేష్‌, రమేష్‌, గంగన్న, కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T04:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising