ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-07-14T06:12:25+05:30

జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సహకారం అందించుటలో భాగంగా నీటిని తొలగిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌ అన్నారు. పట్టణంలోని వికలాంగుల కాలనీలో వర్షపు నీటితో కాలనీ జలమ యం కావడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగడంతో

కాలనీలను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ టౌన్‌, జూలై 13: జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సహకారం అందించుటలో భాగంగా నీటిని తొలగిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌ అన్నారు. పట్టణంలోని వికలాంగుల కాలనీలో వర్షపు నీటితో కాలనీ జలమ యం కావడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగడంతో ఆ ప్రాంతాన్ని మున్సిపల్‌ కమిషనర్‌, ఇతర సిబ్బందితో కలిసి పరిశీలించిన ఆయన వెంటనే జేసీబీతో నీటిని తొలగించే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులు జేసీబీతో నీటిని తొలగిస్తున్నారు. గత రాత్రి కురిసిన వర్షం నేపథ్యంలో కాలనీలో నీరు నిల్వడంతో ఉద యం పూట మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, మున్సిపల్‌ అధికారులు పర్యటించి నివారణ చర్యలు చేపడతామని కాలనీ వాసులకు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని, డిప్యూటీ ఇంజనీర్లు తిరుపతి, సానిటరీ, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-14T06:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising