ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు

ABN, First Publish Date - 2022-06-28T04:38:55+05:30

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరే ట్‌లో ప్రజావాణిలో భాగంగా అర్జీదారుల నుంచి దర ఖాస్తులను స్వీకరించారు.

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, జూన్‌ 27: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరే ట్‌లో ప్రజావాణిలో భాగంగా అర్జీదారుల నుంచి దర ఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని ఆదివాసీ తాత్కా లిక ఉపాధ్యాయుల అసోసియేషన్‌ ప్రతినిధులు వివిధ ఆశ్రమపాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వారికి ప్రస్తుతం ఇవ్వాల్సిన మూడు నెలల వేతనంతో పాటు సీఆర్‌టీ పునరుద్దరణ చేయాలని దరఖాస్తుసమర్పించారు. రెబ్బెన మండలం గోలేటి గౌతమినగర్‌ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌ పుట్టినప్పటి నుంచి అంగవైకల్యం ఉందని, దివ్యాంగుల పెన్షష్‌ పొందుతున్నాని అన్నారు. కానీ ధృవపత్రం రెగ్యులర్‌ చేసుకునే సమయంలో సదరం శిబిరంలో తనకు అంగవైకల్యం లేదని ధృవపత్రాన్ని రద్దు చేశా రని అన్నాడు. తిరిగి తనకు ధృవపత్రం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఆసిఫాబాద్‌ మండలకేంద్రంలోని బజార్‌వాడీకి చెందిన రజియా బేగం తానుటేలాలో బట్టలు కుట్టుకుంటూ ఉపాధి పొందుతున్నానని తనకు ఎలాంటిసమాచారం ఇవ్వ కుండా టేలాను తొలగించడంతో ఉపాధిని కోల్పోయా నని నిరుపేద అయిన తనకు ఉపాధి కల్పించాలని దరఖాస్తు అందజేశారు. పెంచికలపేట మండలం కొండపల్లికి చెందిన ఈశ్వరి పట్టాభూమిలో వ్యవసాయం చేసుకుండగా అటవీ శాఖాధికారులు అడ్డుకుంటున్నారని దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - 2022-06-28T04:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising