ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక తూకం వేస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-05-17T03:57:06+05:30

కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల కంటే ఎక్కువగా ధాన్యం తూకం వేస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని తపాలాపూర్‌, తిమ్మాపూర్‌ గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ భారతి హోళికేరీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జన్నారం, మే 16 : కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల కంటే ఎక్కువగా ధాన్యం తూకం వేస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు.  సోమవారం మండలంలోని తపాలాపూర్‌, తిమ్మాపూర్‌ గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తూకం వేసేటప్పుడు 40 కిలోలు వేయాలన్నారు. ఎక్కువగా తూకం వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగితే నిర్వాహకులపై చర్య లు తీసుకుంటామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రైతులకు సూచించారు.  తహసీల్దార్‌ కిషన్‌, ఎంపీవో రమేష్‌, వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు. 

దండేపల్లి, మే 16: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు  ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయా లని కలెక్టర్‌ భారతి హోళీకేరీ నిర్వాహకులను ఆదేశిం చారు. నెల్కివెంకటాపూర్‌, లింగాపూర్‌ కొనుగోలు కేం ద్రాలను సోమవారం తనిఖీచేశారు. వెంకటాపూర్‌ ఐకే పీ కేంద్రంలో నిర్వాహకులు  బస్తాకు నాలుగు కిలోల చొప్పున అధికంగా తూకం వేస్తూ మోసం చేస్తున్నా రని కలెక్టర్‌ దృష్టికి తీసుకవచ్చారు. ఈ విషయమై అడిగితే తమ ధాన్యం తూకం వేయడం లేదని రైతు లు ఆవేదన వ్యక్తంచేశారు. నిర్వాహకులతో మాట్లాడి రైతులను ఇబ్బందికి గురి చేయవద్దని సూచించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మండి పడ్డారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొను గోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.  తహసీల్దార్‌ హన్మంతరావు, వ్యవసాయ అధికారి అంజిత్‌కుమార్‌, ఆర్‌ఐ పాల్గొన్నారు. 

లక్షెట్టిపేటరూరల్‌: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వేగవంతంగా తూకం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ అధికారులను ఆదేశించారు. ఇటిక్యాల, గుల్లకోట గ్రామాల్లో సోమవారం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.    

Updated Date - 2022-05-17T03:57:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising