ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-07-05T04:19:29+05:30

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ ఉపాధ్యాయులను హెచ్చరించారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం హెచ్‌ఎం, వార్డెన్‌ అందుబాటులో లేకపోవడంతో లంబాడీల ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఆయన సోమవారం పాఠశాలను సందర్శించారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటపల్లి, జూలై 4: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ ఉపాధ్యాయులను హెచ్చరించారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం హెచ్‌ఎం, వార్డెన్‌ అందుబాటులో లేకపోవడంతో  లంబాడీల ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఆయన సోమవారం  పాఠశాలను సందర్శించారు.  స్నానపు గదులు సరిపోవడం లేదని, మరుగుదొడ్లు శుభ్రంగా లేవని, తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయని విద్యా ర్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధ్యా యులు అందుబాటులో ఉండాలన్నారు. ఎంపీడీవో భాస్కర్‌, తహసీల్దార్‌ సునీల్‌ కుమార్‌, పోలీసు శాఖ అధికారులతో మాట్లాడారు. వసతి గృహం సమీపంలో రాత్రి వేళ అల్లరి మూకలు తిరుగుతున్నాయని,  ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసు లకు సూచించారు. ఏటీడీవో చిరంజీవి, ఎంపీపీ మంత్రి సురేఖరామయ్య, తహసీ ల్దార్‌ సునీల్‌కుమార్‌, హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు మహిళా హెచ్‌ఎం, మహిళా వార్డెన్‌లను నియమించాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌కు లంబాడీల ఐక్యవేదిక నాయకులు సమ్మయ్యనాయక్‌, బాపు నాయక్‌లు వినతి పత్రం అందించారు. 

 

Updated Date - 2022-07-05T04:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising