బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-12-16T22:12:51+05:30
బెజ్జూరు, డిసెంబరు 16: మండలకేంద్రంలో నికాడి విజయ్(24) అనే యువకుడు తల్లిదండ్రులు బైక్ కొనివ్వకపోవడంతో మనస్థాపానికి గురైన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వెంక టేష్ తెలిపిన వివరాల ప్రకారం..
బెజ్జూరు, డిసెంబరు 16: మండలకేంద్రంలో నికాడి విజయ్(24) అనే యువకుడు తల్లిదండ్రులు బైక్ కొనివ్వకపోవడంతో మనస్థాపానికి గురైన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వెంక టేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూరుకు చెందిన నికాడి విజయ్ కొద్దిరోజులుగా బైక్ కొనివ్వాలని తల్లి దండ్రులతో గొడవపెట్టుకుంటున్నాడు. ఈక్రమంలో గురువారం రాత్రికూడా తల్లిదండ్రులతో బైక్ విష యమై గొడవపడ్డాడు. తల్లిదండ్రులు గట్టిగా మంద లించడంతో మనస్తాపం చెందిన విజయ్ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు కాగజ్‌నగర్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2022-12-16T22:12:53+05:30 IST