ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోతిని మింగిన కొండచిలువ

ABN, First Publish Date - 2022-10-16T03:40:07+05:30

మండలంలోని కొండాపూర్‌ గ్రామ శివారులోని గోదావరి తీరంలో గల పంటపోలాల వద్ద శనివారం కొండచిలువ కోతిని మింగేసినట్లు రైతులు తెలిపారు.

కొండాపూర్‌ గోదావరి నది సమీప పంట పొలంలో కోతిని మింగిన కొండ చిలువ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండేపల్లి, అక్టోబరు 15: మండలంలోని కొండాపూర్‌ గ్రామ శివారులోని గోదావరి తీరంలో గల పంటపోలాల వద్ద శనివారం కొండచిలువ కోతిని మింగేసినట్లు రైతులు తెలిపారు. పొలాలకు వెళ్లిన రైతులకు ఓ చెట్టు వద్ద కోతుల మంద అరుపులు చేస్తూ కనిపించింది. దీంతో  రైతులు వాటిని చెదరగొట్టే క్రమంలో అక్కడికి వెళ్లిన పలువురు రైతులకు  కోతిని మింగితున్న కొండ చిలువ కనిపించింది. దీంతో రైతులు స్థానికులకు సమాచారం అందించడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద కోతిని మింగడంతో ఊపిరాడక కొండచిలువ అక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పైనుంచి వచ్చిన వరదలో కొండచిలువ కొట్టుకు వచ్చి ఉంటుందని రైతులు చెబుతున్నారు.

Updated Date - 2022-10-16T03:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising