ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కకొండ గుట్టపై గుప్త నిధుల వేట

ABN, First Publish Date - 2022-10-11T05:28:59+05:30

అక్కకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వెనుక భాగంలో తవ్వకా లు కలకలం రేపుతున్నాయి. మూడు గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తెలిపిన కథనం ప్రకారం.. కడెం మండలం సారంగాపూర్‌, దిల్దార్‌నగ ర్‌, ఎలగడప గ్రామ శివారు ప్రాంతా ల్లోని అడవుల్లో వెలిసిన అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వె నుక భాగంలో దసరా కంటే ఒక్కరో జు ముందు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేస్తున్నట్లు సారంగాపూర్‌ గ్రామ పశువుల కాపరి జిట్టవేణి కొండన్న అలియాస్‌ భూమేష్‌ గుర్తించాడు. ఆలయం వెనుక నుంచి శబ్దాలు వినిపిస్తున్నట్లు గమనించి దూరం నుంచి పరిశీలించి భయంతో కొద్ది దూరం వెళ్లి స్నేహితులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌, అక్టోబరు 10: అక్కకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వెనుక భాగంలో తవ్వకా లు కలకలం రేపుతున్నాయి. మూడు గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తెలిపిన కథనం ప్రకారం.. కడెం మండలం సారంగాపూర్‌, దిల్దార్‌నగ ర్‌, ఎలగడప గ్రామ శివారు ప్రాంతా ల్లోని అడవుల్లో వెలిసిన అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వె నుక భాగంలో దసరా కంటే ఒక్కరో జు ముందు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేస్తున్నట్లు సారంగాపూర్‌ గ్రామ పశువుల కాపరి జిట్టవేణి కొండన్న అలియాస్‌ భూమేష్‌ గుర్తించాడు. ఆలయం వెనుక నుంచి శబ్దాలు వినిపిస్తున్నట్లు గమనించి దూరం నుంచి పరిశీలించి భయంతో కొద్ది దూరం వెళ్లి స్నేహితులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. మళ్లీ వా రందరూ అక్కడికి చేరుకొని చూడగా, సారంగాపూర్‌ గ్రామానికి చెందిన ఒ డ్నాల నాగరాజు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన రాజు, లింగారెడ్డి, లక్ష్మణ్‌, రమేష్‌ తవ్వకాలు చేస్తూ కనిపించారు. ఇక్కడ ఏం చేస్తున్నారని పశువుల కా పరి వారిని ప్రశ్నించగా, ఒక మనిషికి పసిరికలు అయ్యాయని వేరు తవ్వుకె ళ్లేందుకు ఇక్కడికి వచ్చామని తెలిపినట్లు పశువుల కాపరి పేర్కొన్నారు. ఈ వి షయాన్ని ఎవరికీ చెప్పవద్దని సదరు వ్యక్తులు పశువుల కాపరిని కోరినట్లు తె లిపారు. వారం తర్వాత విషయం బయటకు పొక్కడంతో సోమవారం ఘటన స్థలాన్ని మూడు గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు, ఆలయ కమిటీ బృందంతో పాటు కడెం ఎస్సై రాజు పరిశీలించారు. ఈవిషయంపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆలయ ద్వారాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆనవాళ్లు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. ఘటన స్థలంలో కుండ పెంకు లు కనిపించడం గుప్త నిధుల తవ్వకాల ఆరోపణలకు బలం చేకూర్చుతున్నా యి. ఈ అంశంపై కలెక్టర్‌, ఎస్పీ, దేవాదాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేయను న్నట్లు నాయకులు తెలిపారు. 


Updated Date - 2022-10-11T05:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising