ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం

ABN, First Publish Date - 2022-10-02T03:45:31+05:30

మూడు దశాబ్దాల క్రితం చదువుకొన్న విద్యార్థులు శనివారం వారు చదివిన పాఠశాలలో కలుసుకున్నారు. రామకృ ష్ణాపూర్‌ పట్టణంలోని పాత సింగరేణి ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్ధుల మహా సమ్మేళనం జరిగింది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ఉపా ధ్యాయులు, విద్యార్ధులు ఠాగూర్‌ స్టేడియం వద్దకు చేరుకొని గుస్సాడి నృత్యాలు, బాణాసంచా పేలు ళ్లు, డప్పుచప్పుళ్ళతో ర్యాలీగా పాఠశాలకు చేరుకొ న్నారు. ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.

పాఠశాల మొదటి బ్యాచ్‌ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రి, అక్టోబరు 1: మూడు దశాబ్దాల క్రితం చదువుకొన్న విద్యార్థులు శనివారం వారు చదివిన పాఠశాలలో  కలుసుకున్నారు.  రామకృ ష్ణాపూర్‌ పట్టణంలోని పాత సింగరేణి ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్ధుల మహా సమ్మేళనం జరిగింది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ఉపా ధ్యాయులు, విద్యార్ధులు ఠాగూర్‌ స్టేడియం వద్దకు చేరుకొని గుస్సాడి నృత్యాలు, బాణాసంచా పేలు ళ్లు, డప్పుచప్పుళ్ళతో ర్యాలీగా పాఠశాలకు చేరుకొ న్నారు. ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం మృతి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ పాఠశాలకు రాగానే పాత రోజులు గుర్తుకొచ్చాయన్నారు. అప్పటి అల్ల రి, తరగతి గదులను మరిచిపోలేదన్నారు. పాఠశా లలో చదువుకున్న వారిలో కొందరు ఇతర దేశాల లో స్థిరపడ్డారని గుర్తుచేసుకొన్నారు. ఈ పాఠశాల లో మొదటి బ్యాచ్‌ 1977-78వ సంవత్సరం  సు భాష్‌ చంద్రబోస్‌ ఖమ్మంలో అదనపు డీఎస్‌పీగా, రవింద్రకుమార్‌ జగిత్యాల ఏసీపీగా విధులు నిర్వ హిస్తున్నారు. 1977 నుంచి 2011 సంవత్సరంలోని 34 బ్యాచ్‌లు ఒకే వేదికపై కలుసుకోవడం ఆకట్టుకుంది. సుమారు 3 వేల మంది విద్యార్థులు, 150 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  ఇంత పెద్ద సమూహం ఎక్కడ జరుగలేదని అందరికీ ఆదర్శంగా సింగరేణి పాఠశాల నిలుస్తుందన్నారు.

పూర్వ విద్యార్ధులతో ట్రస్టును ఏర్పాటు చేసి పాఠశాల, పట్టణ అభివృద్ధి చేపట్టనున్నట్లు పేర్కొ న్నారు. పాఠశాలలో ప్రస్తుతం గురుకుల పాఠశాల నడుస్తుందని, విద్యార్ధుల అవసరాలు, పాఠశాల మరమ్మతు, వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామని పూర్వ విద్యార్ధులు ప్రతిజ్ఞ చేశారు.    

Updated Date - 2022-10-02T03:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising