ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర

ABN, First Publish Date - 2022-10-07T04:54:43+05:30

జిల్లాలో నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాతను బుధ, గురువారాల్లో నిమజ్జనం చేశారు. మంచిర్యాల శోభాయాత్రలో ఎమ్మె ల్యే దివాకర్‌రావు పాల్గొన్నారు. విశ్వనాథ ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర గోదావరి తీరం వరకు కొనసాగింది.

మందమర్రిలో దుర్గాదేవి శోభాయాత్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, అక్టోబరు 6: జిల్లాలో నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాతను బుధ, గురువారాల్లో నిమజ్జనం చేశారు. మంచిర్యాల శోభాయాత్రలో ఎమ్మె ల్యే దివాకర్‌రావు పాల్గొన్నారు. విశ్వనాథ ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర గోదావరి తీరం వరకు కొనసాగింది. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య,  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ సందెల వెంకటేష్‌, నాయకులు విజిత్‌రావు, సిరిపురం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పాత మంచిర్యాలలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. 

మంచిర్యాల కలెక్టరేట్‌: విశ్వనాథ ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహ నిమజ్జన శోభయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ సిరిపురం శ్రీనివాస్‌, దుర్గామాత  నవరాత్రి ఉత్సవ కమిటీ  నిర్వాహకులు బోడ ధర్మేందర్‌, డైరెక్టర్‌ రీనారాణిదాస్‌, ముక్త రవి, రాజు, సౌజన్య, శారద, సదానందం, సంపత్‌ పాల్గొన్నారు. 

మందమర్రి టౌన్‌: పట్టణంలోని ఆయా మండపాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలను మంచిర్యాలలోని గోదావరికి తరలించారు.  దుర్గామాతలను బ్యాండు మేళాలతో ప్రత్యేక వాహనాల్లో తరలించారు. 

హాజీపూర్‌: హాజీపూర్‌, ముల్కల గ్రామాల్లో దుర్గాదేవిని నిమజ్జనం చేశారు. అంతకుముందు శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేశారు.అనంతరం గోదావరిలో నిమజ్జనం చేశారు.  

జన్నారం: చింతగూడ, కలమడుగు, ఇందన్‌పల్లి, జన్నారం, పొనకల్‌ గ్రామాల్లో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాలతో ోభాయాత్ర నిర్వహించారు.    చెరువుల్లో నిమజ్జనం చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

మందమర్రిరూరల్‌ : స్టేషన్‌ రోడ్డులోని బ్రహ్మంగారి ఆలయంలో నవరా త్రులు పూజలందుకున్న దుర్గాదేవికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. రాత్రి శోభాయాత్ర నిర్వహించగా మహిళలు కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేశారు. నర్సింహాచారి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు.   

Updated Date - 2022-10-07T04:54:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising