ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుపాటుకు 152జీవాలు మృతి

ABN, First Publish Date - 2022-09-12T04:30:27+05:30

మండలంలోని గంభీరావుపేట గ్రామ పంచాయతీ లో శనివారం రాత్రి పిడుగుపడడంతో 152గొర్రెలు, మేకలు మృతిచెందాయి. బాధితుల కథనం ప్రకారం.. ఎడుదలపహాడు గ్రామపంచాయతీ శివారులో గొర్రెలు, మేకలమందను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాత్రి ఉరుములు, మెరుపులతో భారీవర్షంతోపాటు పిడుగుపడడంతో 152జీవాలు మృతి చెందాయి.

పిడుగుపాటుతో మృతిచెందిన గొర్రెలు, మేకలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిర్యాణి, సెప్టెబరు 11: మండలంలోని గంభీరావుపేట గ్రామ పంచాయతీ లో శనివారం రాత్రి పిడుగుపడడంతో 152గొర్రెలు, మేకలు మృతిచెందాయి. బాధితుల కథనం ప్రకారం.. ఎడుదలపహాడు గ్రామపంచాయతీ శివారులో గొర్రెలు, మేకలమందను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాత్రి ఉరుములు, మెరుపులతో భారీవర్షంతోపాటు పిడుగుపడడంతో 152జీవాలు మృతి చెందాయి. ఇందులో ఆవుల భూమయ్యకు చెందిన9, జడల ఐలయ్యకు చెందిన13, జడ పోచమల్లుకు చెందిన 10, పబ్బాల ఐలయ్యకు చెందిన 26, పబ్బల మల్లయ్యకు చెందిన 24, పబ్బల మల్లేష్‌కు చెందిన 25, పబ్బల సుజాతకు చెందిన 25, పబ్బల బుచ్చయ్యకు చెందిన 20గొర్రెలు, మేకలు మృతి చెందగా సుమారు రూ.13.75లక్షలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. తిర్యాణి పశువైద్యాధికారి రామకృష్ణ, ఆర్‌ఐ మోహన్‌ సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి 103గొర్రెలు, 49మేకలు మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధితులను జడ్పీటీసీ చంద్రశేఖర్‌, సర్పంచ్‌ వరలక్ష్మి తదితరులు పరామర్శించారు.

Updated Date - 2022-09-12T04:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising