ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశం నుంచి కింద పడిన టైం మిషన్‌ను పోలిన వస్తువు

ABN, First Publish Date - 2022-12-07T12:10:41+05:30

ఆకాశం నుంచి ఒక వింత ఆకారం నేలను తాకింది. అది మరెక్కడో కాదు.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్ల అటవీప్రాంతంలో.. అక్కడే ఉన్న స్థానికులు దానిని చూసి ఒక్కసారిగా విస్తుబోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్ : ఆకాశం నుంచి ఒక వింత ఆకారం నేలను తాకింది. అది మరెక్కడో కాదు.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్ల అటవీప్రాంతంలో.. అక్కడే ఉన్న స్థానికులు దానిని చూసి ఒక్కసారిగా విస్తుబోయారు. చూడబోతే అది.. ఆదిత్య 369 సినిమాలో ఉండే టైం మిషన్‌(Time mission_లా అనిపిస్తోంది. బెలూన్ వంటి పెద్ద ఫాలిథిన్ కవర్ ద్వారా కిందకు సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. గుండ్రంగా ఉన్న భారీ వస్తువు పంటపొలాల్లో ప్రత్యక్షమవ్వడంతో స్థానికంగా అందరూ ఆశ్చర్యానికి, భయాందోళనకు గురయ్యారు. దానిలోపల కెమరాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే లోపల కూర్చోవడానికి సీటు కూడా ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అ వస్తువు ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు. నాలుగేళ్ళ క్రితం కూడా ఇలాంటి వస్తువే ఒకటి వికారాబాద్ జిల్లా దోమ మండల అటవీ ప్రాంతంలో ల్యాండ్ అయ్యింది. వాతావరణ శాఖకు సంబంధించిన సామాగ్రి అని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి వస్తువే వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పంటపొలాల్లో ఆకాశం నుంచి పడడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Updated Date - 2022-12-07T13:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising