ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలువ నీడ లేని జీవితం!

ABN, First Publish Date - 2022-10-17T09:56:38+05:30

నిలువ నీడ లేదు.. పలకరించే నాథుడు లేడు.. ఒకరికి అనారోగ్యం, మరొకరికి అంగవైకల్యం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్లాస్టిక్‌ పరదాల మధ్య అనాథ వృద్ధుల దుర్భర జీవనం

తూప్రాన్‌, అక్టోబరు 16: నిలువ నీడ లేదు.. పలకరించే నాథుడు లేడు.. ఒకరికి అనారోగ్యం, మరొకరికి అంగవైకల్యం.. వయోభారానికి తోడు అర్ధాకలితో ఊరికి దూరంగా సాగుతున్న దుర్భర జీవితం. పుట్టుకతోనే దివ్యాంగురాలైన ఓ అక్క.. పక్షవాతంతో మంచానికి పరిమితమైన ఆమె తమ్ముడి ధీనావస్థ ఇది. 35 ఏళ్లకు పైగా ఒకరికొకరుగా బతుకుతున్న ఆ అక్కాతమ్ముళ్లు ప్లాస్టిక్‌ పరదాల మధ్య తమ కాలం వెళ్లదీస్తున్నారు. వయోభారంతో నానావస్థలు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, ఓ ఇల్లు కేటాయించాలని వేడుకుంటున్నారు. 


సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాలకు చెందిన చెర్మిటి నర్సింహులు(69), మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం లింగారెడ్డిపల్లికి చెందిన సుంచు పోచమ్మ(71) అక్కాచెల్లెళ్ల పిల్లలు(వరసకు అక్కాతమ్ముళ్లు). పుట్టుకతోనే అంగవైకల్యం(కాలు, చెయ్యి సరిగా లేవు) కలిగిన పోచమ్మను ఆమె తల్లిదండ్రులు దేవునికిచ్చి వివాహం చేశారు. ఇక, నర్సింహులుకు వివాహమైన ఏడాదికే అతని భార్య మరణించగా.. ఆ తర్వాత కొంతకాలానికి పక్షవాతానికి గురై మంచంపట్టాడు. అయితే, పట్టించుకునే వారి లేకపోవడంతో పోచమ్మ, నర్సింహులు వర్గల్‌ మండలం నాచారంలోని లక్ష్మినర్సింహస్వామి ఆలయం వద్ద దాదాపు 35 ఏళ్ల పాటు తలదాచుకున్నారు. మంచంపట్టిన తమ్ముడికి దివ్యాంగురాలైన పోచ మ్మ సపర్యలు చేస్తుంటుంది. అయితే, నాలుగు నెలల క్రితం వీరిని ఆ గుడి దగ్గర నుంచి ఖాళీ చేయించారు. దీంతో తుఫ్రాన్‌ శివారులోని కిష్టాపూర్‌ రోడ్డులోని రామాలయం వద్ద పురాతన కల్యాణ మండపంలో ప్లాస్టిక్‌ సంచులు, పరదాలతో గూడు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. దయనీయ జీవితం గడుపుతున్న ఆ వృద్ధులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.  

Updated Date - 2022-10-17T09:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising