ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17న లక్ష మందితో భారీ బహిరంగ సభ

ABN, First Publish Date - 2022-09-08T08:30:25+05:30

భారత్‌లో హైదరాబాద్‌ సంస్థానం విలీనాన్ని పురస్కరించుకొని 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పలువురు మంత్రులు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజరుకానున్న  కేసీఆర్‌.. 

పీపుల్స్‌ ప్లాజా నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వ రకు భారీ ర్యాలీ: మంత్రులు


కవాడిగూడ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): భారత్‌లో హైదరాబాద్‌ సంస్థానం విలీనాన్ని పురస్కరించుకొని 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పలువురు మంత్రులు వెల్లడించారు. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో లక్షలాదిమందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతకుముందు పీపుల్స్‌ ప్లాజానుంచి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఎన్‌టీఆర్‌ స్టేడియం వరకు కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఈ వేడుకలు జరుగుతాయని ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో 17న నిర్వహించే భారీ బహిరంగసభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, సత్యవతి రాథోడ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివా్‌సయాదవ్‌ మాట్లాడుతూ 17న పీపుల్స్‌ ప్లాజా నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు కళాకారుల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన తరువాత అక్కడ నుంచి ఎన్‌టీఆర్‌ స్టేడియం వరకు ర్యాలీ అనంతరం బహిరంగసభ ఉంటుందని పేర్కొన్నారు. సభలో సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన చెప్పారు.


16న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, 18న సమరయోధులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని ఆయన వెల్లడించారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో కుట్రలు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ, తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలను గిరిజనుల పండగగా జరుపుకోబోతున్నామని ఆమె చెప్పారు. గిరిజన ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభించిన అనంతరం వేలాదిమంది గిరిజనులు ర్యాలీగా ఎన్టీర్‌ స్టేడియంకు తరలివస్తారని చెప్పారు. 

Updated Date - 2022-09-08T08:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising